ETV Bharat / state

TOP TEN NEWS: టాప్‌టెన్ న్యూస్@9PM

author img

By

Published : Feb 24, 2022, 8:59 PM IST

TOP TEN NEWS
TOP TEN NEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఉక్రెయిన్​లో భయానక దృశ్యాలు

రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్‌ ఉలిక్కిపడింది. ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబులతో రష్యా విరుచుకుపడింది. కీవ్‌ సహా కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. రష్యా దాడుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

  • ఉక్రెయిన్​లో భారత పౌరుల పడిగాపులు

Indian students in Ukraine: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి దిగిన క్రమంలో ఆ దేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ దేశ గగనతలాన్ని మూసివేసిన క్రమంలో వేలాది మంది భారత పౌరులు, విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో వారిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషిస్తోంది.

  • రష్యాపై ఈయూ కఠిన ఆంక్షలు

Russia Ukraine War: ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగిన రష్యాపై కఠిన ఆంక్షలకు సిద్ధమైంది ఐరోపా సమాఖ్య. యురోపియన్​ దేశాల నేతల ఆమోదం తెలపగానే అమలులోకి తీసుకురానున్నట్లు యురోపియన్​ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డైర్​ లియాన్​ తెలిపారు. రష్యా చర్యను బ్రిటన్​ తప్పుపట్టింది. మరోవైపు.. రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఉక్రెయిన్​ ప్రకటించింది.

  • ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు

Telugu Student On Ukraine : రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధ భయాలతో అక్కడి తెలుగువారు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణక్షణం తాము ప్రాణభయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి, తాగడానికి కూడా తమకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.

  • బయో ఆసియా 2022

Bio Asia 2022: బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ పాల్గొన్నారు. దృశ్య మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులో ఆయనతో పాటు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

  • జగ్గారెడ్డి విషయంలో అధిష్ఠానంతో మాట్లాడతాం

Jagga Reddy meet CLP: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్​ను వీడుతున్నట్లు ఇటీవలే జగ్గారెడ్డి ప్రకటించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

  • రేపటి నుంచే నుమాయిష్

Numaish Exhibition : హైదరాబాద్​ నాంపల్లి మైదానంలో రేపటి నుంచి నుమాయిష్​ ఎగ్జిబిషన్​ పునప్రారంభం కానుంది. జనవరి 1న ప్రారంభమైన పారిశ్రామిక ప్రదర్శన కొవిడ్​ ఉద్ధృతి వల్ల నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొవిడ్​ మహమ్మారి అదుపులోకి రావడంతో రేపటి నుంచి ప్రదర్శన ప్రారంభిస్తున్నట్లు సొసైటీ వర్గాలు తెలిపాయి.

  • రూ. 51 వేల మార్కు తాకిన బంగారం ధర

Gold Price Today: రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంతో పసిడి ధరకు రెక్కలొచ్చాయి. భారత్​లో 10 గ్రాముల బంగారం ధర రూ. 51 వేల మార్కును తాకింది.

  • ఉక్రెయిన్​లో షూటింగ్​ చేసిన భారతీయ సినిమాలు ఇవే!

ప్రస్తుతం ఉక్రెయిన్​లో బాంబులతో మోత మోగిపోతుంది. అయితే ఈ దేశంలో దక్షిణాది సినిమాలు గతంలో షూటింగ్ చేశాయి. వీటిలో 'ఆర్ఆర్ఆర్', '2.ఓ' చిత్రాలు ఉన్నాయి.

  • ఇషాన్ దంచికొట్టుడు

Ishan kishan: లక్నోలో శ్రీలంకతో తొలి టీ20లో టీమ్​ఇండియా.. 200 పరుగుల భారీ టార్గెట్​ ఫిక్స్ చేసింది. ఇషాన్ కిషన్ 89 పరుగులతో ఆకట్టుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.