ETV Bharat / state

గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల వేట

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 8:58 AM IST

Telangana Political Parties Focus on Election Campaign : రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. చలికాలంలో రాజకీయ నేతల ఎన్నికల ప్రచారంతో.. రాష్ట్రం వేడెక్కుతోంది. నువ్వానేనా అన్నట్లు సాగుతున్న ఈ ఎన్నికల సమరంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీలు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నాయి. విస్తృతంగా ప్రచారం సాగిస్తున్న నేతలు.. ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.

Election Campaign
Telangana Political Parties Focus on Election Campaign

రాష్ట్రంలో హోరెత్తిస్తున్న ప్రచారం-గెలుపే లక్ష్యంగా తలపడుతున్న అభ్యర్థులు

Telangana Political Parties Focus on Election Campaign : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Election 2023) రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు హోరాహోరిగా తలపడుతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు సాగిస్తున్నారు. తొమ్మిదినరేళ్ల పాలనలో ప్రగతిని వివరిస్తూ బీఆర్​ఎస్​ నేతలు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సంక్షేమ పాలనతో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్‌ గడప, గడపకూ తిరుగుతోంది. బలహీన వర్గాలను అందలం ఎక్కిస్తామంటూ బీజేపీ జనాల్లోకి వెళ్తోంది.

BRS Election Campaign Telangana 2023 : తెలంగాణలో తొలి రెండు సార్లు అధికారం ఛేజిక్కించుకున్న బీఆర్​ఎస్(BRS)​ మరోమారు గెలిచేందుకు చతురంగ బలాలను వినియోగిస్తోంది. కేసీఆర్​ భరోసా(KCR Bharosa) పేరుతో కొత్త హామీలను జనాల్లోకి తీసుకెళ్తూ గులాబీ నేతలు ఓట్లు అడుగుతున్నారు. హైదరాబాద్‌, సనత్‌నగర్‌ డివిజన్లో హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు వివరించారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి మత్స్యకారులు వలలతో స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో హన్మంత్‌ షిండే ప్రచారం వినూత్నంగా సాగింది. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెద్దగుల్ల గ్రామంలో స్థానిక నేత గుర్రంపై కూర్చోని ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన బీఆర్​ఎస్​ అభ్యర్థి సంజయ్‌కి ఘన స్వాగతాలు లభించాయి.

హుజూరాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్‌ మండలంలో పాడి కౌశిక్‌రెడ్డి, ఆయన భార్య శాలిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభ్యర్థి కడియం శ్రీహరి బీఆర్​ఎస్​ ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిపారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి భార్య సునీత ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఆశీర్వదించమని కోరారు.

Telangana BJP Election Campaign : అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం వ్యూహాలు.. రూట్‌ మ్యాప్‌ సిద్ధం

Telangana Congress Election Campaign 2023 : ఆరు గ్యారెంటీల(Congress Six Guarantees)ను ప్రచారాస్త్రాలుగా మలుచుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా పుంజుకోవటంతో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వం బీసీ జాబితాలో తొలగించిన 27 కులాల సంఘం నేతలు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేశ్‌కు మద్దతు పలికారు. మలక్‌పేట అభ్యర్థి షేక్‌ అక్బర్‌ ప్రచారంలో భాగంగా మాంసం దుకాణంలో మటన్‌ కొట్టి ఓటర్లను ఆకర్షించారు. కామారెడ్డి జిల్లా హన్మాజిపేట్‌ గ్రామంలో ఏనుగు రవీందర్‌ రెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.

సంగారెడ్డిలోని పాత బస్టాండ్‌ ఆవరణలో జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. త్రిపురారం మండలంలో జానారెడ్డి కుమారుడు జైవీర్‌ రెడ్డి ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఓట్లు అడిగారు. సూర్యాపేటలో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి పటేల్‌ రమేశ్‌ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ గెలిపించాలని అభ్యర్థించారు.

ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్​

BJP Election Campaign 2023 in Telangana : బీసీ ముఖ్యమంత్రి నినాదంతో అధికారం పీఠం కైవసం చేసుకునేందుకు కమలదళం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌ రోడ్‌షో నిర్వహించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని పొనుగోడు రామాలయంలో బీజేపీ అభ్యర్థి చల్ల శ్రీలత ప్రత్యేక పూజలు చేశారు. షాద్‌నగర్‌లో అభ్యర్థి అందె బాబయ్యకు మద్దతుగా విజయ సంకల్ప సభ(BJP Election Campaign)కు ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. అనంతరం హుజూరాబాద్‌లో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించారు. తర్వాత అంబేడ్కర్ చౌరస్తాలో స్థానిక నాయకులతో కలిసి చాయ్‌ తాగి, బిస్కెట్లు తిన్నారు.

MIM Election Campaign in Telangana 2023 : హైదరాబాద్‌ పాతబస్తీలో ఎంఐఎం ప్రచారం ముమ్మరం చేసింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గ అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీకి స్థానిక ఓటర్లు ఘన స్వాగతం పలికారు. చార్మినార్‌ నియోజకవర్గ అభ్యర్థి మీర్‌ జుల్ఫెఖార్‌ అలీ ఇంటింటికి ఓట్లు అభ్యర్థించారు. మరోవైపు యువతరానికి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఎస్పీ అభ్యర్థి నిశాంత్‌ కార్తికేయ ప్రచారం నిర్వహించారు.

రణరంగాన్ని తలపిస్తున్న రాజకీయం - ఖమ్మం గుమ్మంలో ఈసారి గెలుపెవరిదో?

పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో గులాబీ నేతల ఓట్ల వేట - మరోమారు అవకాశమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ 'మాట'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.