ETV Bharat / state

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయింపు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 6:54 PM IST

Telangana Congress BC Declaration 2023 : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్​ను ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా.. అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామని డిక్లరేషన్​లో వెల్లడించింది. నిరుద్యోగ బీసీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఇంకా ఏమేం చేయనుందో ఓసారి చూద్దాం.

Telangana Congress Announced BC Declaration
Telangana Congress BC Declaration 2023

Telangana Congress BC Declaration 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌.. పలు డిక్లరేషన్‌ల పేరుతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే యువ, రైతు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​లను ప్రకటించగా.. గురువారం మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. తాజాగా నేడు బీసీ డిక్లరేషన్​ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్ మాదిరిగా మహాత్మా జ్యోతిరావు పూలే సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్న ఆయన.. మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా బీసీలకు అనేక అవకాశాలు కల్పించింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం : సిద్ధరామయ్య

బీసీ డిక్లరేషన్​లోని ముఖ్యంశాలు..:

A. రిజర్వేషన్లు

  • కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు.
  • కొత్తస్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కు పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో(Municipalities) కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ.
  • పభ్రుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్.

B. నిధులు

  • బీసీ సబ్ ప్లాన్​కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు.
  • బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు.

C. సంక్షేమం

  • ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ.
  • అన్ని బీసీకులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు.
  • అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీసర్కిల్, లైబర్రీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు. బీసీ ఐక్యత భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు.

D. విద్య

  • ప్రతీ మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతీ జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల.
  • రూ.3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్​మెంట్.

E. చేతి వృత్తులకు సాయం

  • “వృత్తి బజార్” పేరుతో ప్రతీ మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పా టు చేసి.. మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేత.
  • గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును.. మిగిలిన అన్ని చేతివృత్తులు చేపట్టేవారికి వర్తింపు.
  • బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతీ సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థికసహాయం.

కామారెడ్డిలో నామినేషన్​ వేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ​రెడ్డి

F. వివిధ సామాజిక వర్గాలకు హామీలు

  • ముదిరాజ్, ముత్రాసు, తెనుగోళ్ల సామాజిక వర్గాలను BC-D నుంచి BC-Aలోకి చేర్చడం.
  • అధికారంలోకి వచ్చి న 100 రోజుల్లోనే గొల్లకురుమలకు 2వ దశ గొర్రెల పంపిణీ.
  • తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పా టు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ.
  • జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్లూమ్(Power loom) క్లస్టర్ల ఏర్పా టు.
  • పద్మశాలీలకు పవర్ లూమ్స్, పరికరాలపై 90% సబ్సిడీ.
  • మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు.
  • పట్టణ ప్రాంతాల్లో షాపులు ఏర్పాటుకు భూమి కేటాయింపు.
  • రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.10 లక్షలు.
  • రాష్ట్రవ్యాప్తంగా దోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతీ జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు.

చివరి నిమిషంలో తారుమారు - ఆశ రేపారు, అంతలోనే ఉసూరుమనిపించారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు - ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారెంటీలు వివరిస్తున్న అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.