ETV Bharat / state

Telangana BJP MLA Candidates First List Delay : బీజేపీ తొలి విడత అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 8:43 PM IST

Telangana BJP MLA Candidates First List Delay : తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు వ్యూహాలను రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Bjp
Bjp

Telangana BJP MLA Candidates First List Delay : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే బీఆర్​ఎస్ తమ జాబితా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ ఇవాళ 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది. అంతే కాదు.. ఏకంగా సభలు, సమావేశాలతో ఎన్నికల కదనరంగలోకి దూకాయి. వివిధ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఇప్పటికే టికెట్లు పొందిన అభ్యర్థులు ప్రచారం పర్వానికి తెరలేపారు. పలు చోట్ల టికెట్ రాని అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో వివిధ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు.

కానీ బీజేపీ (Telangana BJP)మాత్రం ఇంకా అభ్యర్థుల విషయంలో ఊగిసలాడుతుందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా కమలం పార్టీ తొలి అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యమయ్యేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమలం నేతలు తొలి జాబితా ఇవాళ లేదా రేపు ప్రకటించాలని భావించారు.

BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు

Delay in Telangana BJP MLA Candidates List 2023 : అయితే జాబితా విడుదలకు మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంకా తెలంగాణకు చెందిన అభ్యర్ధులపై ఎలాంటి చర్చ చేయలేదని సమాచారం. రేపో, మాపో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై దీనిపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు అనంతరం బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాను (BJP MLA Candidates)ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కమలం పార్టీ టికెట్ ఆశిస్తున్న వారంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

BJP Assembly Election Plan 2023 : మరోవైపు ఎన్నికల వేళ పకడ్బందీ మేనిఫెస్టోతో ముందుకెళ్లేలా కాషాయ దళం కసరత్తు చేస్తోంది. విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, సేద్యం, సాగునీరు, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, మహిళా అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, వివిధ రంగాలు, హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల్ని చేర్చాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బీజేపీ ఏం చేయనుందనే అంశాలపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ నేతృత్వంలో ప్రత్యేక ఉప విభాగం కసరత్తు చేస్తోంది.

BJP Assembly Election Plan 2023 : బీసీ నినాదంతో జనంలోకి వెళ్లనున్న బీజేపీ..

బీసీల అజెండాకు ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ నాయకత్వం సూచించిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వెనుకబడిన వర్గాల అన్ని సమస్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ కులాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవుతూ వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి వీలుగా మేనిఫెస్టోలో చేర్చనున్నారు. బీఆర్​ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేక ఛార్జిషీట్‌ను సైతం బీజేపీ రూపొందిస్తోంది. మేనిఫెస్టో, ఛార్జిషీట్లను ప్రతి ఇంటింటికీ చేర్చడం లక్ష్యంగా ముందుకు వెళ్తామని బీజేపీ రాష్ట్ర నేతలు వెల్లడించారు.

BJP MLA Candidate Selections : ఈ నెల 15 లేదా 16న.. బీజేపీ మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.