ETV Bharat / state

ఫొటోలు, వీడియోలు తీయడంలో ఈ తారీక్‌ స్టైల్‌ వేరయా..!!

author img

By

Published : Sep 20, 2022, 4:24 PM IST

ఫోటోగ్రఫీ! వీడియోగ్రఫీ! నేటితరం వీటి కోసం చేయని ప్రయత్నాలు ఉండవు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటేచాలు క్లిక్‌ మనిపించే వారెందరో. అలాంటి ఫోటో, వీడియోల్ని వినూత్నరీతిలో తీయడం ఈ యువకుడు స్టైల్‌. తీయడమే కాక వాటిని ఆకర్షణీయంగా రూపొందించడానికి అవసర మయ్య నియమాలు పది మందితో పంచుకుంటున్నాడు. టిక్‌టాక్‌ స్టార్‌గా, యాక్టర్‌గా, మోడల్‌గానూ రాణిస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు? ఏమా కథ. చూడండి. మీరే.

TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు

ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో రాణిస్తున్న ఈ 23 ఏళ్ల యువకుడి పేరు ఖాన్‌ తారీక్‌. పుట్టింది ముంబైలో. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. చిన్ననాటి నుంచే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఇష్టం ఉన్న థారీక్‌... పాఠశాల, కళాశాల్లో ఏ ఈవెంట్‌ జరిగినా.. వినూత్నంగా ఫోటోలు తీస్తూ అధ్యాపకుల మెప్పు కూడా పొందేవాడు.

TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు

చదువుల్లో చురుకుగా ఉండే తారీక్‌.. ఉద్యోగ బాట పట్టకుండా తనకిష్టమైన ఫోటోగ్రఫీనే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నాడు. అందుకు పెద్దపెద్ద కెమెరాలు కొనాలంటే లక్షల్లోనే డబ్బులు కావాలి. కానీ డబ్బులు లేకున్నా వెనకడుగు వేయకుండా తన వద్ద ఉన్న చిన్న స్మార్ట్‌ఫోన్‌తోనే ఫోటోలు తీయడం ఆరంభించాడు. స్మార్ట్‌ఫోన్‌, చుట్టు ఉండే చిన్న పరికరాలతోనే ఎంతటి క్రియేటివిటీ ఫోటోలనైనా ఈజీగా తీయోవచ్చని నిరూపిస్తున్నాడీ యువకుడు.

TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు
TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు
TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు

చూడండి తన ఇంట్లోనే ఉన్న వస్తువులను తనదైన శైలిలో వినియోగించి ఎలా చిత్రాలు తీస్తున్నాడో. వీటితో తీసిన ఫోటోలను ఎడిటింగ్‌ చేసే నైపుణ్యం కలిగిన ఖాన్‌ తారీక్‌.. తక్కువ కాలంలోనే ది బెస్ట్‌ ఫోటోగ్రాఫర్‌గా ఎదిగాడు. ఫోటోగ్రఫీతో పాటు వీడియోగ్రఫీలోనూ రాణిస్తున్న యువకుడు.. తన నైపుణ్యాన్ని మరింత మందికి పంచాలనుకున్నాడు. దీనికోసం మొదట టిక్‌టాక్‌ బాట పట్టాడు. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది మందికి చేరువయ్యాడు. తన ఫోటోల సమాచారాన్ని.. ఎలాంటి ఫోటోలు తీస్తున్నాననే అనే విషయాలను అక్కడ చెప్తుంటాడు.

TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు
TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు
TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు

క్రియేటివిటీ ఫోటో, వీడియోలతో టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా ఎదిగిన తారీక్‌.. క్రియేటివ్‌ ఫోటోలు, వీడియోలు తీసే తన షూటింగ్‌ ప్రక్రియ, ఎడిటింగ్‌కు విధానాన్ని అభిమానులకు పంచుతున్నాడు. ఎలాంటి ఫోటోలు ఎలా తీయాలి.. దానికి ఎలాంటి మెళకువలు పాటించాలనే అంశాలన్నింటిని అందులో షేర్‌ చేసుకుంటాడు.

TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు
TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు
TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు

ఇంతటి కళాత్మకంగా తీసిన ఫోటోలు, వీడియోలు ఎవరికి నచ్చకుండా ఉంటాయి చెప్పండి. తక్కువ కాలంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తారీక్‌..పలువురు సెలబ్రెటీలకు సైతం ఫోటోగ్రఫర్‌గా వ్యవహరిస్తాడు. ఓ వైపు ఫోటోగ్రఫీతో రాణిస్తున్న యువకుడు.. మరోవైపు యాక్టర్‌, మోడల్‌, ఫ్యాషన్‌ బ్లాగర్‌గానూ తన కెరీర్‌ను మలుచుకున్నాడు.

TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు
TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు
TARIQ YUVA
తారీక్‌ తీసిన ఫొటోలు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.