"గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని" రూ.15 లక్షలు ఫైన్ వేసిన జడ్జి..!

author img

By

Published : Sep 12, 2022, 4:46 PM IST

boyfriend urinate in girlfriend hand bag

"తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష" అనే ఫేమస్ తెలుగు పద్యం ఉంది కదా.. దాన్ని అర్జెంటుగా కొరియన్ భాషలోకి ట్రాన్స్ లేట్ చేసి.. గా షార్ట్ టెంపర్ పోరగానికి పంపితే బాగుండు.. అనే ఫీలింగ్ వస్తుంది ఈ స్టోరీ చదివిన తర్వాత..! ముక్కు మీద కోపంతో.. అతగాడు చేసిన గలీజు పనితో.. కోర్టులో జడ్జికే చిర్రెత్తింది! ఏకంగా.. 15 లక్షలు ఫైన్ వేసి పంపించాడు!! ఇంతకీ.. ఏం చేశాడో తెలుసా..???

boyfriend urinate in girlfriend hand bag
గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని

దక్షిణ కొరియా రాజధాని సియోల్ కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి.. ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది.. ఇది నేచురలే. వారిద్దరూ డబ్బు విషయంలో అప్పుడప్పుడూ గొడవ పడేవారు. ఇది కూడా నేచురలే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు ఆ వ్యక్తి.. ఎవ్వరూ చేయకూడని.. చేయలేని.. "అన్ నేచురల్" పని చేశాడు. ఆ సమయంలో ఇద్దిరి మధ్యన.. మళ్లీ డబ్బుల పంచాయితీ మొదలైంది. "నువ్వు అప్పులు ఎక్కువగా చేస్తున్నావ్" అని ఇతను.. "నువ్వే ఎక్కువగా ఖర్చు చేస్తున్నావ్" అని ఆమె.. ఇలా పంచాయితీ కొనసాగుతోంది. చూస్తుండగానే.. గొడవ శృతి మించింది. సహనం కోల్పోయిన అతగాడు.. గర్ల్ ఫ్రెండ్ బెడ్ రూమ్ లోకి వెళ్లి.. అక్కడున్న హ్యాండ్ బ్యాగుల్లో ఒకదాన్ని తీసుకొని.. తన ప్రియురాలి ఎదురుగానే.. అందులో గలీజు పని చేశాడు. తీవ్రంగా హర్ట్ అయిన యువతి.. అతనికి కటీఫ్ చెప్పేసింది. అంతటితో వదల్లేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. కంప్లైంట్ చేసింది.

boyfriend urinate in girlfriend hand bag
గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని

కేసు నమోదు చేసిన పోలీసులు.. రంగంలోకి దిగారు. నిందితుడైన ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఎందుకలా చేశావని ఇంటరాగేట్ చేశారు. బెంబేలెత్తిపోయిన నిందితుడు.. "అబ్బెబ్బే.. నేనలా చేయలేదండీ.. ఒట్టు నన్ను నమ్మండి.. అలా చేసినట్టు.. ఉత్తిత్తిగా బెదిరించానంతే.." అన్నాడు. దీనికి పోలీసులు.. "అవునా? ఉత్తిత్తిగానో.. నిజంగానో మేం తేలుస్తాం కదా!" అని ఆ బ్యాగును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

boyfriend urinate in girlfriend hand bag
గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని

వన్ "బ్యాడ్ డే".. అతని జాతకం బయటకు వచ్చింది. అతని గర్ల్ ఫ్రెండ్ చెప్పిందే నిజమని, ఆమె హ్యాండ్ బ్యాగులో.. పెంట పని చేసింది నిజమేనని రిపోర్టులో తేలింది. అంతేకాదు.. చేసిన గబ్బు పనిని చెరిపేసేందుకు.. ఆ హ్యాండ్‌బ్యాగ్‌లో.. లిక్విడ్ డియోడరెంట్‌ను పోసినట్టు కూడా ఆధారాలు కనిపించాయి. అయినప్పటికీ ఆ ఛండాలం పూర్తిగా తొలగిపోలేదు. అందులోని ఆధారాలు.. నిందితుడి DNAతో సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. ఇంకేముంది..? ఖేల్ ఖతం.. దుక్నం బంద్.

boyfriend urinate in girlfriend hand bag
గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని

నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టారు.. అతగాడిని చూసిన జడ్జి.. "ఏందిరయ్యా.. బ్యాగులో ఏం చేశావ్..?" అని ప్రశ్నించారు. "మెమ్మెమ్మే.. బెబ్బెబ్బే.." అన్నాడు నిందితుడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుడిని దోషిగా తేల్చారు. చేసిన తప్పుకు శిక్షగా.. 15 లక్షల (కొరియన్) రూపాయలు చెల్లించాలని ఆదేశించారు. ఇది కూడా.. నిందితుడి మొదటి నేరం కాబట్టే.. ఇంత తక్కువ శిక్షతో వదిలేస్తున్నట్టు జడ్జి చెప్పారు. అదన్నమాట ఈ కేసు సంగతి. అతి ఆవేశానికి లోనై.. ఏకంగా 15 లక్షలు సమర్పించుకున్నాడమన్న మాట..! అందుకే.. పెద్దలు ఏమంటారంటే.. తనకోపమే..

boyfriend urinate in girlfriend hand bag
గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని

"ఇంక చాలు ఆపేసెయ్.. ఇందాకట్నుంచి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.. ముందు అతగాడు బ్యాగులో చేసిన ఆ గబ్బు పనేంటో చెప్పేసెయ్.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియనప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు" అంటున్నారా? ఓకే.. ఓకే.. చెప్పేస్తున్నా. గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. ఆ బాయ్ ఫ్రెండ్ చేసిన గలీజు పని ఏమంటే.. సుస్సు పోశాడు!!

boyfriend urinate in girlfriend hand bag
గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని

వీటిపై ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.