ETV Bharat / state

రూ.4.75 కోట్లు స్వాహా చేసిన బ్యాంక్​ మేనేజర్- ఎలా చేశాడో తెలిస్తే షాక్​ అవ్వక మానరు!

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 10:47 PM IST

Bank Manager Cheating Customers
SBI Bank Manager Cheating Case in Hyderabad

SBI Bank Manager Cheating Case in Hyderabad : ఓ బ్యాంక్​ మేనేజర్​ లోన్​ కోసం వచ్చిన కస్టమర్స్​ దగ్గర డాక్యుమెంట్స్​ తీసుకొని రుణం రద్దు చేశాడు. అనంతరం వారి పేరు మీద మూడో పార్టీకు నగదు బదిలీ చేశాడు. బాధితులకు ఈ విషయం తెలియడంతో బ్యాంకును ఆశ్రయించారు. దీంతో అధికారులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు ​రూ.4.75 కోట్లు అనధికార లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది.

SBI Bank Manager Cheating Case in Hyderabad : ఓ బ్యాంక్​ మేనేజర్ తన అధికారాన్ని ఉపయోగించుకుని మోసానికి పాల్పడ్డాడు. సుమారు అనధికారకంగా రూ.4.75 కోట్లు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించి, వెంటనే ఆ మేనేజర్​పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లోని సనత్​నగర్​లో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​లోని సనత్​నగర్​లోని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మాజీ మేనేజర్​ కార్తీక్‌రాయ్‌2020 జూన్​ 20 నుంచి 2023 జూన్​ 16 వరకు పని చేశారు. ఆ సమయంలో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నావారికి లోన్​ రద్దు చేస్తామని చెప్పాడు. దీంతో కొందరికీ మళ్లీ రుణాలు మంజూరు చేశాడు. అయితే ముందు తీసుకున్న అప్పు రద్దు చేయకపోగా ఖాాతాదారులకు తెలియకుండా మంజూరు చేసిన లోన్​లు థర్డ్​ పార్టీ ఖాతాకు నిధులు మళ్లించాడు.

డబ్బుకోసం ఏకంగా బ్యాంకుకే కన్నం వేసిన దొంగ - అలారం మోగడంతో విఫలం

Bank Manager Cheating Customers in Sanath Nagar : కొన్ని రోజులకు లోన్​ పేరిట బ్యాంక్ మేనేజర్ చేసిన మోసాన్ని గ్రహించి బాధితులు కార్తీక్‌రాయ్​ను నిలదీశారు. వారికి సాంకేతిక కారణాల వలన అలా జరిగిందని సాకు చెప్పాడు. రుణాలకు సంబంధించి ఈఎంఐలు చెల్లిస్తానని వారికి హామీ ఇచ్చాడు. ఇక లోన్​ ఖాతాల మూసివేత కోసం రుణ గ్రహీతలు ఇచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్​లను థర్డ్​​ పార్టీ ఖాతాలకు మళ్లించాడు. బ్యాంకులోని పలు డిపాజిట్లకు వ్యతిరేకంగా ఓడీ ఖాతాలను తెరిచి డిపాజిట్ల మొత్తాన్ని అందులోకి మళ్లించాడు. మరణించిన ఖాతాదారులకు సంబంధించిన నిధులను కూడా ఆ థర్డ్​​ పార్టీ ఖాతాల(Bank Manager Cheating)కు బదిలీ చేశాడు.

వరి ధాన్యం డబ్బుల కోసం చెప్పులను క్యూ లైన్​లో పెట్టిన రైతులు

RS.4 Crore Rupesh Bank Manager Cheating Case : నకిలీ పత్రాలు, వేతన స్లిప్పులతో కొత్త రుణాలను మంజూరు చేసి నిధులను మేనేజర్ కార్తీక్‌రాయ్ స్వాహా చేశాడు. ఇలా తనకు అవకాశం ఉన్న పలు రూపాల ద్వారా మొత్తం రూ.4,75,98,979 నిధులు దోచుకున్నాడని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రస్తుత మేనేజర్ రామచంద్ర రాఘవేంద్ర ప్రసాద్ పారపట్టి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు, ప్రస్తుత మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని, ఆధారాలను సేకరిస్తున్నామని ఎస్​ఐ పురేందర్​ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Cyber Criminals Cheating Women in Nizamabad : మరోవైపు నిజామాబాద్​ జిల్లాలోని డిచ్‌పల్లిలో అభయహస్తం(Prajapalana) పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ఓ మహిళకు అభయహస్తం వివరాలు సరిచేయాలని ఫోన్​ చేశారు. దాని కోసం ఓటీపీ చెప్పాలని సైబర్​ నేరగాళ్లు అడిగారు. అనంతరం ఆ మహిళ ఓటీపీ చెప్పింది. వెంటనే ఆమె ఖాతా నుంచి రూ.10 వేలు మాయమయ్యాయి. దీంతో ఆమె విచారం వ్యక్తం చేసింది.

గంటగంటకు.. డబ్బులే డబ్బులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.