డబ్బుకోసం ఏకంగా బ్యాంకుకే కన్నం వేసిన దొంగ - అలారం మోగడంతో విఫలం

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 2:22 PM IST

thumbnail

Theft in Indian Overseas Bank At Dubbaka : రాష్ట్రంలో దొంగలు పక్కాగా ప్రణాళికలను రచించి అందిన కాడికి దోచుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ దొంగ ఏకంగా బ్యాంకు​కే కన్నం వేశాడు. బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి బ్యాంకు గేట్ తాళం పగులగొట్టి ఓ దొంగ లోపలికి ప్రవేశించాడు. దొంగ లోపలికి వెళ్లగానే బ్యాంక్ మేనేజర్ ఫోన్​కు అలారం రావడంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు అలారం శబ్దంతో అలర్ట్​ అయిన గ్రామస్థులు బ్యాంకు ప్రధాన ద్వారానికి తాళం వేసి దొంగను బంధించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని ధర్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. దొంగ వెంట ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.