ETV Bharat / health

వెరైటీలకు దూరం, ఫ్రూట్స్ ఎక్కువ తినడం- వెజిటేరియన్స్​ చేసే పెద్ద మిస్టేక్స్ ఇవే! - Vegetarians Mistakes To Avoid

author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 7:53 PM IST

Vegetarian Food Mistakes : అన్నీతినే వాళ్లు ఆరోగ్యం కోసం పెద్దగా పాట్లు పడాల్సిన అవసరం ఉండదు. కానీ నేను వెజిటేరియన్​ను వెజ్ మాత్రమే తింటాను, నాన్ వెజ్ జోలికి పోనే పోను అనుకునువాళ్లు మాత్రం ఆరోగ్యం విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరమే. వారు కొన్ని సూచనలు పాటించాలి. అవేంటంటే?

Vegetarians
Vegetarians (Source : Getty Images)

Vegetarian Food Mistakes : క్షణం తీరిక లేకుండా సాగిపోతున్న నేటి జీవితంలో కేవలం త్వరగా, రుచిగా తినాలి అనుకుంటున్నారే తప్ప ఆరోగ్యంగా తినాలి అనుకువే వాళ్లు తక్కువ. చాలా మంది ఆరోగ్యాన్ని పక్కకు పెట్టి, రుచి మీదనే దృష్టి పెడుతూ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం తూచా తప్పకుండా కఠినంగా డైట్ ఫాలో అవుతూ కేవలం వెజ్ మాత్రమే తింటూ జాగ్రత్తగా ఉంటున్నామని అనుకుంటున్నారు. వాళ్లే వెజిటేరియన్లు. అయితే వెజ్ మాత్రమే తింటున్నాం. ఆరోగ్యంగా ఉంటున్నాం అనుకుంటూనే వారికే తెలియకుండానే చాలా పెద్ద తప్పులు చేస్తున్నారట వెజిటేరియన్లు. వెజ్ మాత్రమే తీసుకోవాలనే తపనతో న్యూట్రియస్ ఫుడ్‌కు దూరమవుతుండటం బాధకరమైన విషయం. మీరూ వెజిటేరియన్ అయి ఉంటే నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదనుకుంటే ఈ సూచనలు పాటించి ప్రొసీడ్ అవ్వండి.

డైరీ ప్రొడక్టులు
వెజిటేరియన్లు చాలా నమ్మకంగా, ఆరోగ్యంగా ఉంటుందని యోగర్ట్ తీసుకుంటుంటారు. కానీ, యోగర్టులన్నీ ఒకటి కాదు. చాలా వరకూ షుగర్ మిక్స్ చేసి ఉంటాయి. అందులో బెస్ట్ చూసి తీసుకోవాలి.

ప్రొటీన్లు
శరీరం ఎదుగుదలకు లేదా రికవరీకి ప్రొటీన్లు అనేవి చాలా ముఖ్యం. ఇది ద‌ృష్టిలో పెట్టుకుని చాలా మంది వెజిటేరియన్లు ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటారు కానీ, అవి ఒకేసారి తీసుకోవడం కంటే ప్రతి రోజు తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

ఫ్రూట్స్ తినడం
చాలా మంది తమ ఆహారంలో స్నాక్స్​కు బదులు ఫ్రూట్స్ తింటుంటారు. ఇలా కేవలం ఫ్రూట్ మాత్రమే స్నాక్‌గా తీసుకోవడం వల్ల ఆకలి అనేది ఇంకా పెరిగిపోతుంది.

వెరైటీలకు దూరం
వెజిటేరియన్లు ఒక ఫిక్స్‌డ్ ఫుడ్​కు అలవాటుపడి ఎక్కువ వెరైటీలను తీసుకోరు. చాలా మొక్కల్లో ఎమినో యాసిడ్లు తక్కువ. మరి మీరు తీసుకునే ఆహారంలో ఎమినో యాసిడ్లు ఉంటున్నాయా అని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

విటమిన్ బీ-12లోపం
ఒక్కసారిగా నాన్ వెజ్ మానేసినా లేదా పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నా మీ ఆహారంలో విటమిన్ బీ-12 సమతుల్యంగా ఉందా అని చెక్ చేసుకుంటుండాలి. ఒక కప్పు పాలు, ఒక గుడ్డు కలిపి తీసుకుంటే ఒక్క రోజుకు సరిపడా అంటే 2/3వ వంతు విటమిన్ బీ-12 అందుతుంది.

కాల్షియం తీసుకునేందుకు ప్రత్యామ్నాయం
శరీరానికి సరిపడా కాల్షియం కోసం డైరీ ప్రొడక్టులకు నో చెప్పి ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే వైట్ బీన్స్, బాదంపప్పులు, తాహినీ, ఫిక్స్, కమలాలు సరైన ఆహారం

మాంసానికి బదులు చీజ్
చీజ్ రుచిలో ఎల్లప్పుడూ మాంసానికి మంచి ప్రత్యామ్నాయం. అంతేకాకుండా ప్రొటీన్ల విషయంలో కూడా. కానీ, అందులో సరిపడా న్యూట్రియంట్లు దొరకవు. అంతేకాకుండా కొవ్వు శాతం కూడా ఎక్కువ అనేది గుర్తుంచుకోవాలి.

మాంసాన్ని పోలిన ఆహారం
ఇటువంటి ఆహార పదార్థాలు ఫిజికల్ శాటిస్ఫాక్షన్ ఇచ్చినా ఎక్కువ సాల్ట్ ఉండటం వల్ల, మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తాయి.

వెజిటేరియన్ ఫుడ్ తింటే చాలదు
ఎక్కువ మందిలో ఉన్న అపోహ ఏంటంటే జంతు మాంసాలను తినడం మానేసి వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఇక ఆరోగ్యవంతులం అయిపోయినట్లే అనుకుంటున్నారు. కానీ, అదే వాళ్లు చేసే తప్పు.

సలాడ్లతో క్యాలరీలు నింపేయెద్దు
నాన్ వెజిటేరియన్​లో ఉండే క్యాలరీల కంటే సలాడ్ లలోనే ఎక్కువ క్యాలరీలు తీసుకుంటుంటారు. సలాడ్‌లపైన వేసుకునే మైనీస్, లెట్టూస్ లాంటి ఆయిల్ పదార్థాలు తీసుకుని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేం.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.