ETV Bharat / state

Sandalwood Trees Theft in Nehru Zoo Park : నెహ్రూ జూపార్కులో గంధపు చెట్ల చోరీ

author img

By

Published : Jul 23, 2023, 2:16 PM IST

Updated : Jul 23, 2023, 2:41 PM IST

Sandalwood Trees Theft in Nehru Zoo Park
Sandalwood Trees Theft in Nehru Zoo Park

Sandalwood Trees Theft in Nehru Zoological Park Hyderabad : నిత్యం పర్యాటకులతో రద్ధీగా ఉండే నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో గంధపు చెట్ల చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు 7 గంధపు చెట్లను నరికి చిన్న చిన్న దుంగలుగా చేసి ఎత్తుకెళ్లినట్లు జూ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపగా.. వారు బహదూర్​పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sandalwood Trees Missing in Zoo Park Hyderabad : నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే చోట గుర్తు తెలియని వ్యక్తులు గంధపు చెట్లను నరికి, దుంగలుగా చేసి ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ నెహ్రూ జూలాజికల్ పార్కులో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం నెహ్రూ జూలాజికల్​ పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు 7 గంధపు చెట్లను నరికివేసి ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7 గంధపు చెట్లను నరికి చిన్న చిన్న దుంగలుగా చేసి అందులోని కొన్ని దుంగలు ఎత్తుకెళ్లిపోగా.. కొన్ని ఘటన స్థలం సమీపంలో దొరికాయి.

నెహ్రూ జూపార్కులో గంధపు చెట్ల చోరీ
నెహ్రూ జూపార్కులో గంధపు చెట్ల చోరీ

Seven Sandalwood Trees theft in Zoo Park : నెహ్రూ జూలాజికల్​ పార్కులో వణ్య ప్రాణులతో పాటు ఖరీదైన గంధపు చెట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన జూ అధికారులు 7 గంధపు చెట్లను నరికినట్లు గుర్తించారు. అందులో కొన్ని దుంగలను మాత్రమే జూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని జూ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జూ అధికారులు బహదూర్​పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంధం చెట్లు దొంగతనాలకు గురవతున్న నేపథ్యంలో జూ పార్కులో పరిసరాలలో అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, మరింత భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రిన్సిపల్​ చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్​ (పీసీసీఎఫ్​) లోకేశ్​​ జైస్వాల్​ జూ అధికారులను ఆదేశించారు.

జూ చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏర్పాటు : జూ పార్కులోని గంధపు చెట్లను నరికి వేసిన ప్రాంతాన్ని శనివారం ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జూ పార్కులో జూ అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని క్యూరేటర్​కు సూచించారు. సీసీ కెమెరాలను ఏర్పాటుతో పాటు సెక్యూరిటీని కూడా నియమించాలన్నారు. జూ చుట్టూ ఎలక్ట్రికల్​ ఫెన్సింగ్​ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జూ పార్కులో జంతువుల సంరక్షణ, వాటి ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జూ పార్కు డైరెక్టర్​ వినయ్​కుమార్​, క్యూరేటర్​ ప్రశాంత్​ బాజిరావు పాటిల్​ తో పాటు జూ అధికారులు పాల్గొన్నారు. అయితే గతంలో కూడా జూ పార్కులో గంధపు చెట్లు ఇలానే గుర్తు తెలియని వ్యక్తులు నరికి తీసుకెళ్లారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 23, 2023, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.