ETV Bharat / state

కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న రెండేళ్ల బాబు - దాతల సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు - Child suffering Gaucher Disease

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 10:59 PM IST

child need help for Operation : అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ బాబుని కాపాడటానికి తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ఉన్నందంతా ఉడిచి పెట్టి అప్పుల పాలయ్యారు. వైద్యానికి మరిన్ని లక్షలు ఖర్చు అవుతుందని తెలిసి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దాతలు ముందుకొచ్చి తమ పిల్లాడి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వమైన తమని ఆదుకోని బాబుని బతికించాలని కోరుతున్నారు.

Two years Child Suffering With Flatulence
child need help for Operation (ETV Bharat)

కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న రెండేళ్ల బాబు - దాతల సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు (ETV Bharat)

Two years Child Suffering With Flatulence : జనగామ జిల్లా, తిమ్మంపేటకు చెందిన కుంభోజు మహేశ్వర్, అలేఖ్య దంపతులకు 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మహేశ్వర్‌ కులవృత్తి మంగలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడిదిన్నర వరకు ఆరోగ్యంగానే ఉన్న కుమారుడు మాధవన్‌, గత 6 నెలలుగా అన్నం తినకపోవడం కడుపు ఉబ్బడం, పొట్ట పెరిగి వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పటి వరకు ఇంట్లో సందడిగా తిరిగిన కుమారుడు ఒక్కసారిగా అనారోగ్య పాలవడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయారు.

జిల్లాలో పలు ఆస్పత్రులు తిప్పిగా బాబుకి పెద్ద ప్రమాదం ఉందని హైదరాబాద్ నిలోఫర్​కు తీసుకెళ్లాలని సూచించారు. నిలోఫర్‌కు డాక్టర్లు బాబుకు అన్ని పరీక్షలు చేసి "గౌచర్ డిసీస్ -1"అనే వ్యాధి ఉందని నిర్ధారించారు. ఈ వ్యాధి లక్షణం ఉన్నవారు రక్తం ఉత్పత్తి అవ్వక చిక్కిపోయి నిరసించి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

వ్యాధి చికిత్సకు 24 లక్షల రూపాయలు : అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్​లోని నిమ్స్‌కు తీసుకెళ్లగా "ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ"అనే ఇంజక్షన్ వేయాల్సి ఉంటుందని, నెలకు రెండు వేయాలని వైద్యులు చెప్పారు. ఇంజక్షన్‌ ధర లక్ష 24 వేల రూపాయలు ఉంటుందని, అవి జీవిత కాలం వాడాలని చెప్పడంతో ఆర్థిక స్తోమత లేక ఆ దంపతులు వెనుతిరిగారు. చివరికి జూబ్లీహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో వ్యాధికి శాశ్వత చికిత్స చేయొచ్చని, అందుకు రూ. 24 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు.

ఇప్పటి వరకు తన దగ్గర ఉన్నవి అప్పు చేసి ఆస్పత్రులు తిప్పామని, అంత మొత్తం డబ్బులు కంటే స్థోమత తమకు లేదని తల్లితండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోని బాబు ప్రాణాలు కాపాడాలని దంపతులు వేడుకుంటున్నారు. పెద్ద మనసుతో దాతలు సాయం చేసి తమ బాబు ప్రాణాలు కాపాడాలని ఆ దంపతులు చేతులు చాచి అర్ధిస్తున్నారు.

'మా బాబుకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గత ఏడాదిన్నర వరకు ఆరోగ్యంగా ఉన్న మా బాబు, గత ఆరు నెలల నుంచి కడుపు ఉబ్బడం జరిగింది. బాబును ఆసుపత్రుల్లో చూపించగా పెద్ద ప్రాబ్లమ్​ ఉందని హైదరాబాద్‌లో నిలోఫర్‌ ఆసుపత్రికి పంపించారు. అక్కడ నయం కాకపోవడంతో రెయిన్‌బో ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ బాబుకు ఆపరేషన్​ చేస్తామని డాక్టర్లు చెప్పారు. దానికి 24 లక్షలు రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. మాకు సాయం చేసి మా బాబు ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నా'- బాబు తల్లిదండ్రులు

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన - చిన్నారి వైద్యానికి సీఎం రేవంత్ సాయం

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన - ఎన్​ఆర్​ఐ ప్రమేయంతో చిన్నారి మహాన్​కు చికిత్స - NRI HELPS FOR CHILD BRAIN SURGERY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.