ETV Bharat / state

ఇందూరు వాసులకు గుడ్‌న్యూస్... అందుబాటులోకి అర్బన్‌ పార్క్!

author img

By

Published : Dec 21, 2022, 3:27 PM IST

NIZAMABAD URBAN PARK STORY పక్షుల కిలకిలరావాలు, నెమళ్ల నాట్యాలు, కుందేళ్ల గంతులు, చెంగు చెంగున ఎగిరే జింకలు నిజామాబాద్‌లో ప్రకృతి ప్రేమికులకు... త్వరలోనే ఇవన్నీ కనువిందు చెయ్యనున్నాయి. 450 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పది కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

URBAN PARK
ఇందూరు వాసులకు గుడ్‌న్యూస్... అందుబాటులోకి అర్బన్‌ పార్క్!

ఇందూరు వాసులకు గుడ్‌న్యూస్... అందుబాటులోకి అర్బన్‌ పార్క్!

NIZAMABAD URBAN PARK STORYఉరుకులు పరుగుల జీవన ప్రయాణంలో ప్రజలు ప్రకృతి రమణీయతను అస్వాదించలేకపోతున్నారు. రణగొణ ధ్వనులు కాలుష్యపు వాతావరణంలో జీవిస్తూ ప్రశాంతమైన వాతావరణానికి దూరమవుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులనుంచి ప్రజలకు కాస్త ఉపశమనం ఇవ్వడానికే నిజామాబాద్‌కు పది కిలోమీటర్ల దూరంలో గల మక్లూర్‌ మండలం చిన్నాపూర్‌ అటవీప్రాంతంలో 10 కోట్ల వ్యయంతో 450 ఎకరాల పరిధిలో అర్బన్ పార్కు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్న పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. పార్కులో తిరిగినప్పడు అటవీలో సంచరించే అనుభూతి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎత్తైన ప్రదేశం నుంచి చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించేలా వాచ్ టవర్ ఏర్పాటు చేశారు. ఈ అటవీ ప్రాంతంలో రకరకాల జంతువులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి ఇబ్బందులు కలగకుండా ప్రజలు సంచరించే విధంగా నిర్వాహకులు రూపకల్పణ చేశారు.

పార్క్‌లో ప్రధానం ద్వారం గుండా అడవిలోకి వెళ్లేందుకు మూడు రోడ్లు వేశారు. వాటికి అనుగునంగా చిన్నచిన్న పిల్లదార్లు నిర్మించారు. అంతే కాకుండా పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌లు, పిల్లలు అడుకునేందుకు వీలుగా ఆటవస్తువులు ఏర్పాటుచేశారు. వీటితో పాటు పలువురిని ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలు అమర్చారు. పార్కులోని కాల్వలపై అందమైన కల్వర్టులు నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా పిల్లల్ని ఆకట్టుకునేందుకు జంతువుల బొమ్మలు సైతం ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ నగర సమీపంలోని సారంగాపూర్ అటవీ ప్రాంతంలో ఇప్పటికే ఒక అర్బన్ పార్కు ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఆర్మూర్ రోడ్డులో చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.