ETV Bharat / state

75 TYPES OF BIRYANI: ఒకే చోట 75 రకాల బిర్యానీలు.. ఎక్కడోకాదు మన హైదరాబాద్​లోనే..

author img

By

Published : Apr 7, 2022, 12:46 PM IST

కళాశాలకు 50.. బిర్యానీలు 75.. 'లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డు..!'
కళాశాలకు 50.. బిర్యానీలు 75.. 'లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డు..!'

75 TYPES OF BIRYANI: బిర్యానీ.. ఈ పేరు చెబితే చాలు భోజనప్రియుల నోరూరుతుంది. వెంటనే నచ్చిన రెస్టారెంట్​కు వెళ్లి తినాలనిపిస్తుంది. ఇలా వారానికోసారైనా వివిధ రకాలను రుచి చూస్తుంటారు. అలాంటి భోజన ప్రియులకు పదుల రకాల బిర్యానీలను కళ్లముందుంచితే ఎలా ఉంటుంది..? హైదరాబాద్​ విద్యానగర్​లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 రకాల బిర్యానీలను పాకశాస్త్ర నిపుణులు తయారు చేశారు. అవన్నీ ఎందుకు చేశారంటే..

కళాశాలకు 50.. బిర్యానీలు 75.. 'లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డు..!'

75 TYPES OF BIRYANI: హైదరాబాద్​ విద్యానగర్​లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్​ హోటల్​ మేనేజ్​మెంట్​ 50 వసంతాలు పూర్తి చేసుకోవడంతో.. కళాశాల స్వర్ణోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా ఒక రికార్డు సాధించాలని.. మేనేజ్​మెంట్​ భావించింది. అజాదీకా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా.. 75 రకాల బిర్యానీలను తయారు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం దేశంలో ఎన్ని రకాల బిర్యానీలున్నాయి, అవి ఏయే ప్రాంతాల్లో తయారు చేస్తారు? ఎలా చేస్తారు అనే విషయాలపై రెండు నెలలుగా పరిశోధించి.. 75 రకాల బిర్యానీలను తయారు చేశారు.

ఇందులో వివిధ రెస్టారెంట్లలో వినే చికెన్, మటన్, చేప, రొయ్య, పీత బిర్యానీతో పాటు.. మరిన్ని కొత్త రకాలను తయారు చేశారు. అందులో కచ్చేగోష్కీ బిర్యానీ, బొంగు బిర్యానీ, డొన్నె బిర్యానీ, లక్నవీ బిర్యానీ, సూఫియనీ బిర్యానీ, బర్వానీ బిర్యానీ, అంబూర్​ బిర్యానీ ఉన్నాయి. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాముఖ్యత ఉన్న బిర్యానీలన్నీ తయారు చేశారు. నోరూరించే ఈ బిర్యానీలను ఆస్వాదించేందుకు కస్టమర్లకు కూడా స్వాగతం పలికారు.

రికార్డు కొట్టాలని: లిమ్కా బుక్ఆఫ్ రికార్డు సాధించేందుకు.. 10 మంది పాకశాస్త్ర నిపుణులు, 20 నుంచి 30 మంది విద్యార్థులు.. 4 గంటల పాటు శ్రమించి 75 రకాల బిర్యానీలను తయారు చేశారు. వాటి ప్రాధాన్యతను తెలియజేసేలా.. బోర్డులను ఏర్పాటు చేసినట్లు హోటల్​ మేనేజ్​మెంట్​ విభాగాధిపతి తెలిపారు. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయామని.. 75 రకాల బిర్యానీ వంటకాల్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. లిమ్కా బుక్ ఆఫ్​ రికార్డు కోసం 75 రకాల బిర్యానీలు తయారు చేసిన స్ఫూర్తితో.. బుధవారం అతిపెద్ద ఫ్లవర్​ బొకేను తయారు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి: Car Won in Lucky Draw: బిర్యానీ తిన్నారు.. హ్యుందాయ్​ కారు పట్టారు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.