ETV Bharat / state

Car Won in Lucky Draw: బిర్యానీ తిన్నారు.. హ్యుందాయ్​ కారు పట్టారు.!

author img

By

Published : Apr 3, 2022, 11:10 AM IST

Car Won in Lucky Draw: కొత్త కారు కొనాలంటే ఎంత తక్కువ అనుకున్నా రూ. 10 లక్షలు అయినా పెట్టాల్సిందే. కానీ ఓ బిర్యానీ తింటే ఖరీదైన కారును పట్టేయొచ్చని మీకు తెలుసా. బిర్యానీ అంటే మహా అయితే రూ. 500 ఖర్చవుతుంది. ఆ 500తోనే లక్షల విలువైన కారును సొంతం చేసుకున్నారు ఓ మహిళ. నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో.. ఉగాది.. నూతన తెలుగు సంవత్సరమే కాదు.. వారింటికి కొత్త కారును, సంతోషాన్ని తీసుకొచ్చింది. అసలు ఈ కారు, బిర్యానీ, ఉగాది గోల ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి..

Sainma Restaurant lucky draw
సైన్మా రెస్టారెంట్​ లక్కీ డ్రా

Car Won in Lucky Draw: ఓ రెస్టారెంట్​ పెట్టిన బంపర్​ ఆఫర్​లో ఖరీదైన కారును గెలుచుకుంది ఓ మహిళ. బిర్యానీ పార్సిల్​ తీసుకుని లక్కీ డ్రాలో విజేతగా గెలుపొందారు. ఉగాది సందర్భంగా కానుకగా ఇంటికి కొత్త కారును తెచ్చుకున్నారు. హైదరాబాద్ కొంపల్లికి చెందిన సైన్మా రెస్టారెంట్ నిర్వహించిన బంపర్ ఆఫర్​లో హైదరాబాద్​కు చెందిన రేఖ కారును గెలుచుకున్నారు. తమ స్టోర్​లో బిర్యానీ తీసుకెళ్తే ఓ లక్కీ విన్నర్ కారును గెలుచుకోవచ్చని గత నెలలో యాజమాన్యం ప్రకటించింది. దీనికి అనూహ్య స్పందన లభించింది. నెల రోజుల వ్యవధిలో రెస్టారెంట్​లో బిర్యానీ పార్సిల్ తీసుకెళ్లిన సుమారు 5000 మందికి కూపన్లు అందజేసింది. ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం.. సినీ హీరో ఆది చేతులమీదుగా లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. నగరానికి చెందిన రేఖ.. హ్యుందాయ్ వెన్యూ కారును గెలుచుకున్నట్లుగా తెలిపారు.

తమదైన స్టయిల్​లో పబ్లిసిటీ: గత మూడేళ్ల క్రితం సందీప్ రెడ్డి, అక్షయ్ రెడ్డి కలిసి... ఈ సైన్మా రెస్టారెంట్​ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్​కు కొంపల్లి పరిసరాల్లో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పాత సినిమా పాటలు, పోస్టర్లు, పాత రేడియోలను అలంకరించి... కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ సారి కారును బంపర్ ఆఫర్​గా ప్రకటించి... తమదైన రీతిలో పబ్లిసిటీ చేశారు.

లక్కీ డ్రాలో హ్యుండాయ్ వెన్యూ: కస్టమర్ల ఆదరణ లభించడంతో వినియోగదారుల కోసం ఏదైనా కొత్తగా చేయాలని భావించిన యాజమాన్యం... ఉగాది సందర్భంగా ఓ హ్యుండాయ్ వెన్యూ కారును లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతిగా ఇవ్వనున్నట్లు హోటల్ నిర్వాహకులు ప్రకటించారు. విజేతను ఏప్రిల్​ 2న లక్కీ డ్రా ద్వారా ప్రకటించనున్నట్లు తెలిపారు. దీంతో లక్కీ డ్రా లో గెలుపొందిన రేఖకు కారును బహుమతిగా అందించింది.

ఇదీ చదవండి: మార్చిలో మండిన ఎండలు.. 122 ఏళ్ల రికార్డు బద్దలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.