ETV Bharat / state

గాంధీభవన్‌లో మూడు ఉచిత అంబులెన్సులు ఏర్పాటు

author img

By

Published : May 23, 2021, 6:01 PM IST

హైదరాాబాద్​ గాంధీ భవన్​లో ఉచిత అంబులెన్సు సర్వీసులను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కమార్​ రెడ్డి ప్రారంభించారు. ఇవి 24 గంటలు అందుబాటులో ఉండి పేదలకు అవసరమైన సేవలు అందిస్తాయని ఉత్తమ్​ తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో వీటిని ఏర్పాటు చేశారు.

uttam
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

కొవిడ్‌ బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు కాంగ్రెస్‌ మూడు అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది. గాంధీ భవన్‌లో ఈ మూడు అంబులెన్స్‌లను సిద్దంగా ఉంచింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ అంబులెన్స్‌లను ఇవాళ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. ఇవి 24 గంటలు అందుబాటులో ఉండి పేదలకు అవసరమైన సేవలు అందిస్తాయని ఉత్తమ్​ తెలిపారు.

అంబులెన్స్ ఉచిత సేవల కోసం ఫోన్ చేస్తే ఏ ఆస్పత్రిలో దింపాలన్నా అక్కడ దింపుతాయన్నారు. గాంధీ భవన్ హెల్ప్ డెస్క్ 040-24601254కి కాల్ చేసి అంబులెన్స్‌ అవసరాలను తెలియచేస్తే.. పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పొంచి ఉన్న 'యాస్​' ముప్పు- అధికారులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.