ETV Bharat / state

వేడెక్కుతున్న రాష్ట్ర రాజకీయాలు - అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూ సాగుతున్న విపక్షాల ప్రచారాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 12:28 PM IST

Opposition Parties Telangana Elections Campaign 2023 : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచార జోరు పెంచుతున్నాయి. నియోజకవర్గాలన్నీ ప్రచారాల హోరుతో మార్మోగుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు గడప గడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓవైపు అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూ.. మరోవైపు ఆయా పార్టీల మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023
Opposition parties Telangana Elections Campaign 2023

అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూ ప్రచారం చేస్తున్న విపక్షాలు

Opposition Parties Telangana Elections Campaign 2023 : టీపీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతురావు, మల్లు రవి.. బీఆర్ఎస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలంటే.. కాంగ్రెస్‌కు ఓటేయాలని గాంధీభవన్‌ వేదికగా కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రచారం ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలో హస్తం అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీనాయక్.. ఇంటింటికీ తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఎమ్మెల్యే సీతక్క గడపగడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బీజేపీ - జనసేన మధ్య తేలిన సీట్ల లెక్క, తెలంగాణలో 9 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన

Telangana Assembly Elections 2023 : హనుమకొండ జిల్లా పరకాల అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్.. తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతూ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడు పాయలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు తనను గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుజుర్​నగర్‌లో రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటంలో బీఆర్ఎస్​కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

నారాయణపేటలోని హనుమాన్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్‌ అభ్యర్థి చిట్టెం పర్నికరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌ కాంగ్రెస్, బీఆర్ఎస్​లపై తీవ్ర విమర్శలు చేశారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రరెడ్డి గెలుపే లక్ష్యంగా.. పార్టీ శ్రేణులతో కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. మరోవైపు ఈటల పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం హుజురాబాద్‌లో.. ఆయన సతీమణి జమున ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు నష్ట నివారణ చర్యల కోసం రంగంలోకి సీనియర్లు

Telangana Election Campaign 2023 : జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎంపీ ధర్మపురి అరవింద్.. నియోజకవర్గ ప్రజలను కలుస్తూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ ప్రజా ఆశీర్వాద పాదయాత్ర ప్రారంభించారు. గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గుండె విజయరామారావు.. ఓటర్లను కలిసి కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో.. అభ్యర్థి భూక్య సంగీత నామినేషన్ పత్రాల సమర్పణకు ముందు ప్రత్యేక పూజలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ప్రచారం చేపట్టారు.

నాగార్జున సాగర్‌లో ధర్మసమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మామిడి సైదయ్యను.. ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ప్రకటించారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కడం కోసమే పార్టీని స్థాపించినట్లు ఆయన తెలిపారు. అనంతరం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ధర్మ సమాజ్‌పార్టీ అభ్యర్థి ఎల్లయ్యకు మద్దతుగా.. రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టార్చిలైట్ గుర్తుపై ఓటు వేసి ధర్మసమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పొలాల నొదిలి ప్రచారానికి కూలీలు తెలంగాణ ఎన్నికల హడావిడిలో వారిదే జోరు

నేడు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.