ETV Bharat / state

KTR US Tour : అమెరికాలో కేటీఆర్​ టూర్.. పెట్టుబడులతో క్యూ కడుతున్న ప్రముఖ కంపెనీలు

author img

By

Published : May 21, 2023, 5:42 PM IST

KTR US Tour
KTR US Tour

KTR Agreement With Famous Companies In America : తెలంగాణకు పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనతో రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఆ దేశ పర్యటనలో ఉన్న మంత్రి ఆదివారం వివిధ రంగాల్లో అగ్రగామి సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో పలు కంపెనీలతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ భేటీల్లో మంత్రితో పాటు ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్​, ఎన్​ఆర్​ఐ అఫైర్స్​ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్​ రెడ్డి పాల్గొన్నారు.

KTR Agreement With Famous Companies In America : అమెరికాలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ చేస్తున్న ప్రయత్నాలతో.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌లో 10 వేల మందితో ఉపాధి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు VXI గ్లోబల్ సొల్యూషన్స్‌ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో.. VXI గ్లోబల్ చీఫ్ హెచ్​ఆర్​ ఎరికా బోగర్ కింగ్ సమావేశమై.. సంస్థ నిర్ణయాన్ని వెల్లడించారు. 1998లో నెలకొల్పిన ఆ సంస్థకు ప్రస్తుతం ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్‌, కరేబియన్‌ దేశాల్లోని.. 42 కేంద్రాల్లో 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఇప్పుడు హైదరాబాద్‌లో పదివేల మందితో కొత్త కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

ప్రముఖ మాండీ, రేవ్​ గేర్స్​ సంస్థల పెట్టుబడులు : హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు.. ప్రముఖ పర్యాటక సంస్థ మాండీ ముందుకొచ్చింది. ఆ కేంద్రంతో 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కేటీఆర్‌తో సమావేశం తర్వాత.. మాండీ ఛైర్మన్‌ ప్రసాద్‌ గుండుమోగుల తెలిపారు. ప్రముఖ గేర్ల ఉత్పత్తి సంస్థ.."రేవ్‌ గేర్స్‌" రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్​ను కలిసిన.. రెవ్‌గేర్స్‌ ప్రతినిధి బృందం తమ ఆకాంక్షను వ్యక్తం చేసింది.

సెల్ఫ్​ స్టోరేజ్​ సంస్థ స్టోరెబుల్​ : అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపాలో సెల్ఫ్‌ స్టోరేజి పరిశ్రమలో.. సేవలు అందిస్తున్న స్టోరెబుల్‌ సంస్థ.. ఇప్పుడు హైదరాబాద్‌లో 100 మంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లను నియమించుకొని విస్తరణ ప్రణాళికపై దృష్టిసారించనున్నట్లు తెలిపింది. ఆ విస్తరణతో.. పరిశోధన, అభివృద్ధి రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించగలమని సంస్థ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జి- టాస్క్​తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.

ప్రముఖ డిజిటల్​ సొల్యూషన్స్​ సంస్థ పెట్టుబడులు : డిజిటల్‌ సొల్యూషన్స్‌ రంగంలో అగ్రగామి సంస్థ రైట్‌ సాఫ్ట్‌వేర్‌ రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలకు సహకరిస్తూ కొత్త అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 30న హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కేంద్రాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రంలో ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ప్రముఖ గ్లోబల్‌ సప్లై చెయిన్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ చెక్‌జెన్స్‌ హైదరాబాద్‌లో అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న.. కేటీఆర్​ని కలిసిన చెక్‌జెన్స్‌ అధ్యక్షుడు లక్ష్మీ ఎనిగెల్ల, సీఈవో రఘు కొమ్మరాజు.. ఈ మేరకు ప్రకటించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.