ETV Bharat / state

దేశ రాజకీయాల్లో కేసీఆర్​తో కలిసి సాగలనుంది: గద్దర్​

author img

By

Published : Nov 19, 2020, 9:05 PM IST

దేశ రాజకీయాల్లో కేసీఆర్​తో కలిసి సాగలనుంది: గద్దర్​
దేశ రాజకీయాల్లో కేసీఆర్​తో కలిసి సాగలనుంది: గద్దర్​

సీఎం కేసీఆర్​ గొప్ప ప్రజా నాయకుడు, పాలనాదక్షుడని ప్రజా గాయకుడు గద్దర్​ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టినట్టయితే, దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆయనతో ముందుకు సాగాలనేది తన అభిమతమన్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దాదాపు సగభాగం సస్యశ్యామలంగా మారిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ప్రజా నాయకుడు, పాలనాదక్షుడని ప్రజా గాయకుడు గద్దర్ వాఖ్యానించారు. దేశ రాజకీయాల గతిని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే.. దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ పెట్టి సంపూర్ణ మద్దతిస్తానన్నారు.

minister-koppula-eshwar-met-gaddar-and-gaddar-praise-cm-kcr
దేశ రాజకీయాల్లో కేసీఆర్​తో కలిసి సాగలనుంది: గద్దర్​

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంకటాపురం డివిజన్ తెరాస ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గద్దర్​ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ తెలంగాణ సాధనకు 14 రోజుల పాటు కఠోర దీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. గొప్ప నాయకుడైన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టినట్టయితే, దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆయనతో ముందుకు సాగాలనేది తన అభిమతమన్నారు.

కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దాదాపు సగభాగం సస్యశ్యామలంగా మారిందని.. రైతులు, ప్రజలు సంతోషిస్తున్నారని కొనియాడారు. తెరాస కార్పొరేటర్​గా వెంకటాపురం డివిజన్ నుంచి పోటీ చేస్తున్న సబితా కిశోర్​ను ఆశీర్వదించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.