ETV Bharat / state

జగన్‌ రాజకీయ భిక్షతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి కోటంరెడ్డి : కాకాణి

author img

By

Published : Feb 7, 2023, 9:01 AM IST

minister kakani comments on MLA kotamreddy : వైఎస్సార్సీపీ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి.. ప్రభుత్వంపై ఫోన్​ట్యాపింగ్​ ఆరోపణలు చేయడం తన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు నెల్లూరు జిల్లా నేతలు తెలిపారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎన్నికైన తరువాత తొలిసారి నగరానికి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ నేతలు, శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు.

minister kakani comments
minister kakani comments

minister kakani comments on MLA kotamreddy : వైఎస్ జగన్‌ పెట్టిన రాజకీయ భిక్షతో ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శ్రీధర్ రెడ్డి పార్టీ మారడం వలన వైఎస్సార్సీపీకి నష్టం ఏం లేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్​రెడ్డిని నియమించడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 26 మంది కార్పొరేటర్లలో 16 మంది ఆదాల ప్రభాకర్​రెడ్డి వైపు వచ్చారన్నారు. మిగిలిన వారు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు.

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎన్నికైన తరువాత తొలిసారి నగరానికి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ నేతలు, శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. వైసీపీను వీడినందుకు కోటంరెడ్డి బాధపడే రోజు తప్పనిసరిగా వస్తుందని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. నెల్లూరు గ్రామీణ సమన్వయకర్తగా సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

నెల్లూరులో వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ: నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్​గా నియమితులైన ఎంపీ ఆదాల ప్రభాకర్​రెడ్డిని అభినందిస్తూ నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప గుడి సెంటర్ నుంచి వీఆర్​సీ సెంటర్ మీదుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ బీదా మస్తాన్ రావు, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కొండ్రెడ్డి రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదాలకు మద్ధతుగా భారీ జనసమీకరణ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.