ETV Bharat / state

హెచ్ఎండీఏ మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన కేటీఆర్​

author img

By

Published : Aug 14, 2020, 4:06 PM IST

ktr started matti vinayak statues of hmda
హెచ్ఎండీఏ మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన కేటీఆర్​

హైదరాబాద్ ప్రగతిభవన్​లో హెచ్ఎండీఏ మట్టి వినాయక విగ్రహాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కరోనా దృష్ట్యా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. కరోనా దృష్ట్యా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్, హుస్సేన్​సాగర్ శుద్ధి కార్యక్రమంలో భాగంగా రసాయనాల వాడకంతో రూపొందించే వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా హెచ్ఎండిఏ చేస్తున్న కృషిని కొనియాడారు.

హెచ్ఎండీఏ ఎనిమిదేళ్లుగా సంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను కుమ్మరి వారితో తయారు చేయించి స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. హెచ్ఎండీఏ మట్టి వినాయక విగ్రహాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్​లో ఆవిష్కరించారు. తొలి వినాయక విగ్రహాన్ని మేయర్ బొంతు రామ్మోహన్​కు మంత్రి అందించారు. హెచ్ఎండీఏ పరిధిలోని 32 సెంటర్లలో ఉచితంగా 50 వేలమట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేయనున్నారు.

ఇదీ చదవండి: 'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.