ETV Bharat / state

Implementation of Election Code in Telangana : రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలు.. పోలీసుల తనిఖీలు షురూ

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 3:28 PM IST

Updated : Oct 10, 2023, 7:48 PM IST

Implementation of Election Code in Telangana : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్​రాజ్ తెలిపిన అనంతరం నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana Election Code
Implementation of Election Code in Telangana

Implementation of Election Code in Telangana : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయ పరమైన రాతలు కనబడకుండా తెల్లసున్నం వేయించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ప్రకటనలు ఉండకుండా అధికారులు చూసుకుంటున్నారు. ఎవరైనా ఎలక్షన్ కోడ్ సీఈసీ ఆదేశాలను పక్కగా పాటించాలని.. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగడంతో వెంటనే ఎన్నికల కోడ్‌ (Election Code) అమలులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన యంత్రాగం ఎన్నికల నియామావళిని పకడ్బంధీగా అమలుచేస్తోంది. ఎలాంటి విఘాతాలకు చోటు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేలా.... ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా నగదు, బంగారం, లిక్కర్ తరలింపు వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

election commission official 12 cards : ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారికంగా​ ప్రకటించిన.. 12 గుర్తింపు కార్డులివే

Khammam Collector Meeting On Elections : ఖమ్మంలో అధికారులతో జిల్లా పాలనాధికారి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రామాణికాలు పాటించాలో సిబ్బందికి సూచించారు. ప్రజలతో మమేకమై పని చేయాలని.. ఎలాంటి అవాంతరాలకు చోటివ్వవద్దని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..

Warangal Police Caught Rs.8 Lakhs in Inspection : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు నగర శివారులలో వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎంజీఎం కూడలితోపాటు రుద్రమదేవి కూడలి వెంకటరమణ జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా... మిల్స్ కాలనీ పోలీస్​స్టేషన్ (Police Inspections) పరిధిలో పోలీసులు చేసిన వాహన తనిఖీలలో రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Election Code Implementation in Nalgonda : నల్గొండ జిల్లాలో అధికారులు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కానీ కొన్నిచోట్ల రాజకీయ పార్టీలకు చెందిన దివంగత నాయకుల విగ్రహాలు దర్శనమివ్వడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా మారిందని ప్రజానికం విస్తుపోతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన 24గంటల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన కటౌట్లను తొలగించాలని నిబంధన ఉన్నప్పటికీ అధికారులు అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విధమైన ధోరణితో ఎన్నికలను నిష్పక్షపాతంగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Telangana Assembly Elections Schedule 2023 : నేడే తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

5 State Assembly Election 2023 : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఆ రోజే!

Last Updated :Oct 10, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.