ETV Bharat / state

CEO Vikas Raj on Telangana Elections 2023 : 'రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమలు.. అభ్యర్థులు అవి తెలపకపోతే నామినేషన్ల తిరస్కరణే'

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 6:48 PM IST

Updated : Oct 9, 2023, 7:55 PM IST

CEO Vikas Raj on Telangana Elections 2023 : రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమలులోకి వచ్చిదని.. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్​ పేర్కొన్నారు. అఫిడవిట్​లో అభ్యర్థులు అన్ని కాలమ్స్​ను కచ్చితంగా నింపాలని.. వివరాలు తెలపకపోతే నామినేషన్​ తిరస్కరణకు గురవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వెబ్​సైట్లలో నాయకుల ఫోటోలు తొలగించాలంటూ సూచించారు.

Telangana Elections
CEO Vikas Raj on Telangana Elections

CEO Vikas Raj on Telangana Elections : రాష్ట్రంలో కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసేందుకు.. యంత్రాంగం సిద్ధమయ్యిందని.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్‌(CEO Vikasraj) తెలిపారు. ఎన్నికల వేళ.. రాష్ట్రంలో నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక అవసరాల ఓటర్లకు.. ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అఫిడవిట్​లో అభ్యర్థులు అన్ని కాలమ్స్​ను కచ్చితంగా నింపాలని.. వివరాలు తెలపకపోతే నామినేషన్​ తిరస్కరణకు గురవుతుందని స్పష్టం చేశారు.

Telangana Assembly Elections Schedule 2023 : తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. నవంబర్​ 30న పోలింగ్

Telangana Assembly Elections 2023 : ఓటు హక్కు లేనివారు అక్టోబర్​ 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో స్పష్టం చేశారు. కానీ ఓటర్ల చిరునామాలో మార్పులకు దరఖాస్తులను.. ఇవాళ్టి నుంచి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మహిళ, యువత, దివ్యాంగులకు ప్రత్యేకంగా నిర్వహించే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఎమైనా అక్రమాలు చోటు చేసుకుంటే ఫిర్యాదు చేయడానికి "సీ విజల్​" యాప్​, 1950 నెంబర్​కు కాల్​ చేయాలని సూచించారు.

ప్రభుత్వ వెబ్​సైట్లలో నాయకుల ఫోటోలు తొలగించాలంటూ సీఈవో వికాస్​రాజ్​ స్పష్టం చేశారు. ప్రకటనలకు ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల వేళ.. రాష్ట్రంలో నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్యాయంగా 12 కార్డులను వినియోగించుకోవచ్చని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా.. పోలీసుల తనిఖీల్లో నగదు దొరికితే వాటికి సంబంధించిన పత్రాలు, వివరాలు ఉండాలని పేర్కొన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు లౌడ్​ స్పీకర్లకు అనుమతిలేదన్నారు. బ్యాలెట్​ పత్రాలపై గుర్తులతో పాటు.. అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. బ్రెయిలీ బ్యాలెట్​ పత్రాలు ఉంటాయన్నారు.

Ronald Ross on Telangana Elections : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు పోలీస్ కమీషనర్.. కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నగర ఓటర్లు తమ ఓటును మరోసారి పరిశీలించుకోవాలని.. ఓటు లేని వారు అక్టోబర్ 31 వరకు నమోదు చేసుకోవాలని సూచించారు.

"రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. ఓటు హక్కు లేనివారు అక్టోబర్​ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళ, యువత, దివ్యాంగులకు ప్రత్యేకంగా నిర్వహించే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రభుత్వ వెబ్​సైట్లలో నాయకుల ఫోటోలు తొలగించాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు లౌడ్​ స్పీకర్లకు అనుమతిలేదు". - వికాస్​రాజ్​, సీఈవో

CEO Vikas Raj on Telangana Elections 2023 'రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమలు.. అవి తెలపకపోతే నామినేషన్ల తిరస్కరణే'

5 States Election Date 2023 : 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఫలితాలు ఎప్పుడంటే?

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..

Last Updated : Oct 9, 2023, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.