ETV Bharat / state

CEO Vikas Raj on Election Arrangements : 'ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగింది.. అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2023, 5:17 PM IST

Updated : Sep 23, 2023, 7:14 PM IST

CEO Vikas Raj on Election Arrangements : వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తుందని సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. కేంద్ర బృందం రాజకీయ నాయకులతో సమావేశం అవుతుందని చెప్పారు. అనంతరం సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లతో.. వారు భేటీ కానున్నట్లు చెప్పారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల ఓట్లు నమోదయ్యాయని.. 3 లక్షల ఓట్లు రద్దు అయినట్లు వికాస్​రాజ్ వెల్లడించారు.

Telangana Assembly Elections 2023
ceo Vikas Raj

CEO Vikas Raj on Election Arrangements Details : ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని.. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్ (CEO Vikas Raj) తెలిపారు. 24, 25 తేదీల నుంచి సమ్మరి రివిజన్ ప్రారంభమైందని దీనిని త్వరలోనే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈవీఎంలను అన్నింటిని చెక్ చేశామని.. అధికారుల శిక్షణ కోసం ఈవీఎంలను తెప్పించామని వివరించారు. బీఆర్​కే భవన్​లో మీడియా కేంద్రాన్ని సీఈఓ వికాస్​రాజ్ ఈరోజు ప్రారంభించారు.

అనంతరం వికాస్​రాజ్​ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మీడియా ప్రతినిధుల కోసం రెండు స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల వరకు కొత్త ఓటర్లు పెరిగారని తెలిపారు. యువ ఓటర్లు 6.99 లక్షల వరకు నమోదు చేశామని.. ప్రత్యేకంగా మహిళలు, బాలికలను కూడా ఈ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వికాస్​రాజ్​ అన్నారు.

Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా

Vikas Raj on Vote Registration Program : ప్రతి ఒక్క యువ ఓటర్​ను గుర్తించి నమోదు చేస్తున్నట్లు వికాస్​రాజ్ తెలిపారు. థర్డ్​జెండర్​ల ఓటు నమోదు కార్యక్రమాన్ని (Vote Registration) చేపట్టడం.. వృద్ధులను గుర్తించడం వారి ఓటు నమోదు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వృద్ధులు స్వచ్చందంగా కోరుకుంటే.. ఇంటివద్దనే వారికి ఓటు వేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని వివరించారు. ఇందుకోసం ఎంపికను పారదర్శకంగా చేపడుతున్నట్లు వికాస్​రాజ్ వెల్లడించారు.

వచ్చే నెలలో ఎన్నికలకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు.. స్ట్రాంగ్ రూములు వంటివి ఏర్పాటు చేస్తున్నామని వికాస్​రాజ్ తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించడం.. వారికి శిక్షణ ఇవ్వడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్ పరిశీలించి.. సీఈసీ సూచనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా..? లేదా వంటి వాటిని పరిశీలించి.. లేకుంటే సౌకర్యాలు కల్పిస్తున్నామని వికాస్​రాజ్ వివరించారు.

Telangana Assembly Elections 2023 : హైదరాబాద్​కు ఈసీ.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

Central Election Commission Team to Visit Telangana : కౌంటింగ్ కేంద్రాలను గుర్తించడంతో పాటు.. కేంద్ర బలగాలకు వసతి, రవాణా సౌకర్యం, వారికి విధుల కేటాయింపు వంటిపై దృష్టిసారించామని వికాస్​రాజ్ పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఈవీఎంల ర్యాండమైజేషన్ తదితర ఏర్పాట్లు, శిక్షణ కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో కేంద్ర బృందం పర్యటిస్తుందన్నారు. అన్ని అంశాలపై రాష్ట్ర స్థాయిలో పర్యటించడంతో పాటు.. తమతో కూడా సమావేశం కానున్నట్లు వికాస్​రాజ్ వివరించారు.

కేంద్ర బృందం.. రాజకీయ నాయకుల ప్రతినిధులతో సమావేశం అవుతుందని వికాస్​రాజ్ తెలిపారు. ఆ తర్వాత కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తారని.. అనంతరం డీజీపీ, సీఎస్​తో వారు భేటీ అవుతారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్​ఫోర్స్​మెంట్ ఏజెన్సీలు సుమారు 20కి పైగా గుర్తించామన్నారు. ఇందులో పోలీస్, ఎక్సైజ్, జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్, ఇన్​కంట్యాక్స్, డీఆర్​ఐ, ఎఫ్ఐయూ, బ్యాంకర్స్ , ఆర్​బీఐ, ఎయిర్​పోర్ట్ తదితర ఏజెన్సీలు ఉన్నాయని వికాస్​రాజ్ పేర్కొన్నారు.

Telangana Assembly Elections 2023 : ఎన్నికల ఎఫెక్ట్.. అధికారుల బదిలీలపై కసరత్తు షురూ

Telangana Assembly Elections : జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని.. 3.38 లక్షల ఓట్లను తొలగించినట్లు వికాస్​రాజ్ పేర్కొన్నారు. 15 లక్షల ఫారం-8లు వచ్చాయని వివరించారు. వీటిలో ఎక్కువగా మార్పులు, చేర్పులు.. అడ్రస్​లను సరిచేయడం, పేర్లు నమోదు చేసుకోవడం వంటివి ఉన్నాయని చెప్పారు. 4,000 నివాస సముదాయాల్లో సుమారు 700 టీములు వెళ్లి.. వీటిని సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. 15,000ల పైచిలుకు ఫారం-6, ఫారం-8లు వచ్చాయని వికాస్​రాజ్ వెల్లడించారు.

CEO Vikas Raj on Election Arrangements ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది

"వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తుంది. కేంద్ర బృందం రాజకీయ నాయకులతో సమావేశం అవుతుంది. సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లతో కేంద్రబృందం సమావేశం అవుతుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల ఓట్లు నమోదయ్యాయి. 3 లక్షల ఓట్లు రద్దు అయ్యాయి. ప్రక్రియ కొనసాగుతోంది." - వికాస్‌రాజ్‌, సీఈఓ

Telangana Voters List 2023 : ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం.. మొత్తం ఓటర్లు 3.06 కోట్లు

Voter Awareness Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ శాతం పెంచడంపై స్పెషల్ ఫోకస్

Last Updated : Sep 23, 2023, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.