ETV Bharat / state

CEO Vikas Raj Review on Voter Enrolment in Hyderabad : 'ఓటు హక్కు నమోదు చేసుకునేలా.. ఓటర్లను చైతన్య పరచాలి'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 9:48 PM IST

CEO Vikas Raj Review on Voter Enrolment in Hyderabad : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. అందులో భాగంగా ఓటర్లుగా నమోదు చేసుకునేలా పౌరులను పెద్ద ఎత్తున చైతన్య పరచాలని.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​ రాజ్​ అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో సీఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Telangana Election Commission
CEO Vikas Raj Review on Improve Voter Enrolment in Hyderabad

CEO Vikas Raj Review on Voter Enrolment in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లను చేస్తోంది. అందులో భాగంగా ఓటర్లుగా నమోదు చేసుకునేలా పౌరులను పెద్దఎత్తున చైతన్యపరిచేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(CEO Vikas Raj) అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్(Electoral Registration) అధికారులతో సీఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఓటర్ల నమోదు ప్రక్రియను మెరుగుపరచడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఫారమ్ 6, 7, 8లను సమర్థవంతంగా నిర్వహించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ఫారమ్‌లు ఓటరు నమోదు, నమోదిత ఓటర్లకు అభ్యంతరాలు పరిష్కరించడంతోపాటు ఓటరు బదిలీలను నిర్వహించడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Telangana Election Commission : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత పనులు ఏ రోజుకారోజు సత్వరం పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడంతోపాటు చివరి తేదీ వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ వేచి ఉండవద్దని ఆదేశించారు. సెప్టెంబరు 3వ తేదీ ఆదివారం నాటికి అన్ని ఫిజికల్ ఫారమ్‌ల డేటా ప్రాసెసింగ్, ఫొటోల అప్‌లోడ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని సూచించారు.

Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా

EC to Speed up Printing of EPIC : జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో ఎలక్టర్ ఫొటో గుర్తింపు కార్డుల (EPIC) ముద్రణ కూడా మరింత వేగవంతం చేయాలని డీఈఓలను ఆదేశించారు. కొత్తగా లేదా సరవణలతో కూడిన ఓటరు గుర్తింపు కార్డులు ప్రతి 15 రోజులకు ఒకసారి ముద్రించి, అర్హులైన ఓటర్లకు వెంటనే చేరేలా చూడాలనేది ప్రణాళికని తెలిపారు. ఎన్నికల అవగాహనను ప్రోత్సహించేందుకు ఎస్‌వీఈఈపీ కార్యకలాపాలు విస్తృతంగా చేపట్టాలని ఉద్ఘాటించారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఓటరును ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ల్లో భాగస్వాముల్ని చేయడం, స్థానిక ప్రభావశీలులతో అవగాహన కల్పనపై డీఈఓలు ప్రత్యేక దృష్టి సారించాలని వికాస్ రాజ్ కోరారు.

Telangana CEO Vikas raj interview: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న ఈసీ

Telangana Assembly Election 2023 : వీటితో పాటు త్వరితగతిన ఓటర్ల నమోదును చేపట్టాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటుహక్కు కోసం నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ తెలిపింది. ఈ కార్యక్రమంలో సంయుక్త సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీఈఓ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగి జిల్లా కలెక్టర్లు దురిశెట్టి అనుదీప్‌, హరీష్, అమోయ్ కుమార్, కకంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

Telangana Assembly Elections 2023 : వేగం పుంజుకున్న అసెంబ్లీ ఎన్నికల కసరత్తు.. వాటిపై ప్రత్యేక దృష్టి

Telangana Assembly Elections 2023 : 'ఆ కేంద్రాల్లో సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.