ETV Bharat / state

అటవీ అధికారిణిపై దాడి కేసులో కోనేరు కృష్ణకు బెయిల్​

author img

By

Published : Aug 27, 2019, 10:40 PM IST

కోనేరు కృష్ణ

అటవీ అధికారిణి అనితపై దాడి కేసులో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు... కోనేరు కృష్ణకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది. రూ.15 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరి పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సాక్షులను ప్రభావితం చేయవద్దని తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది.

అటవీ అధికారిణిపై దాడి కేసులో కోనేరు కృష్ణకు బెయిల్​

కాగజ్​నగర్​లో అటవీ అధికారిణి అనితపై దాడి కేసులో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు... కోనేరు కృష్ణకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో 16 మందికి బెయిల్ ఇస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.15 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు... మరో ఇద్దరి పూచీకత్తులను స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని కోనేరు కృష్ణ సహా నిందితులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని... ఫిర్యాదుదారులను బెదిరించవద్దని తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : "ప్రజలు బుద్ధిచెప్పినా.. కాంగ్రెస్ నేతల తీరుమారలే..."

Intro:సికింద్రాబాద్.. యాంకర్ ..మహాత్మా నగర్ ప్రాంతానికి చెందిన శవాన్ని తమ ప్రాంతంలో ఉన్న స్మశాన వాటిక వద్ద ఖననం చేయొద్దని స్థానికులు గొడవకు దిగారు..
స్థానిక తహశీల్దార్ అక్కడకు చేరుకొని వారితో మాట్లాడగా శవాన్ని పెట్టేందుకు ఆయన కూడా అంగీకరించలేదు ..
దీంతో మృతుడి కుటుంబసభ్యులు,బంధువులు మృతదేహంతో స్మశాన వాటిక వద్ద ఆందోళనకు దిగారు
గత కొన్ని తరాలుగా తాము ఇక్కడే ఖననం చేస్తున్నామని కుటుంబసభ్యుల చెబుతున్నారు..ఎమ్మార్వో మాట్లాడుతూ గతంలో ఈ స్థలంలో స్మశానవాటిక ఉన్నప్పటికీ పది సంవత్సరాలుగా ఈ స్థలంలో ప్రభుత్వానికి సంబంధించిందని ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఖననాలను చేయట్లేదని అన్నారు...చనిపోయిన అబ్బాయి హనుమంతరావు తండ్రి శవాన్ని కూడా ఇక్కడే పెట్టినట్లు అతన్ని కూడా ఇక్కడే పెట్టినట్లు వారి కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు..ఎమ్మార్వో రాకతో ఆందోళన మరింత ఉధృతమైంది..వీరు mahatma nagar ప్రాంతానికి చెందిన వారిగా వారు తెలిపారు ..శవాన్ని ఈ స్థలంలో పెట్టడానికి ఎమ్మార్వో అంగీకరించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు..బైట్ రాజేష్ బంధువులుBody:VamshiConclusion:సికింద్రాబాద్.. యాంకర్ ..మహాత్మా నగర్ ప్రాంతానికి చెందిన శవాన్ని తమ ప్రాంతంలో ఉన్న స్మశాన వాటిక వద్ద ఖననం చేయొద్దని స్థానికులు గొడవకు దిగారు..
స్థానిక తహశీల్దార్ అక్కడకు చేరుకొని వారితో మాట్లాడగా శవాన్ని పెట్టేందుకు ఆయన కూడా అంగీకరించలేదు ..
దీంతో మృతుడి కుటుంబసభ్యులు,బంధువులు మృతదేహంతో స్మశాన వాటిక వద్ద ఆందోళనకు దిగారు
గత కొన్ని తరాలుగా తాము ఇక్కడే ఖననం చేస్తున్నామని కుటుంబసభ్యుల చెబుతున్నారు..ఎమ్మార్వో మాట్లాడుతూ గతంలో ఈ స్థలంలో స్మశానవాటిక ఉన్నప్పటికీ పది సంవత్సరాలుగా ఈ స్థలంలో ప్రభుత్వానికి సంబంధించిందని ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఖననాలను చేయట్లేదని అన్నారు...చనిపోయిన అబ్బాయి హనుమంతరావు తండ్రి శవాన్ని కూడా ఇక్కడే పెట్టినట్లు అతన్ని కూడా ఇక్కడే పెట్టినట్లు వారి కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు..ఎమ్మార్వో రాకతో ఆందోళన మరింత ఉధృతమైంది..వీరు mahatma nagar ప్రాంతానికి చెందిన వారిగా వారు తెలిపారు ..శవాన్ని ఈ స్థలంలో పెట్టడానికి ఎమ్మార్వో అంగీకరించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు..బైట్ రాజేష్ బంధువులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.