ETV Bharat / state

'భోగి మంటల్లో పాత వస్తువులతో పాటు.. జీవో నెంబర్​ 1'

author img

By

Published : Jan 14, 2023, 12:45 PM IST

TDP Agitation Against GO No.1
భోగి మంటల్లో జీవో నెంబర్​1 కాపీలు దగ్ధం

TDP Agitation Against GO No.1: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్యర్యంలో భోగి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో టీడీపీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. వేడుకలను నిర్వహించిన అనంతరం భోగి మంటల్లో జీవో నెంబర్ 1​ కాపీలను వేసి దగ్ధం చేశారు. అవసరం లేని వస్తువులను తగలబెట్టినట్లు.. అవసరం లేని చీకటి జీవోను మంటల్లో వేశామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

TDP Agitation Against GO No.1:ఆంధ్రప్రదేశ్​లో ప్రతిపక్ష పార్టీ నేతల, పార్టీల గొంతు నొక్కడానికే ప్రభుత్వం జీవో నెంబర్ వన్​ను తీసుకువచ్చిందని ఆరోపణలున్నాయి. జీవో నెంబర్​ ​వన్​ను రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్​ చేస్తున్నారు. రాష్ట్రంలోనున్న అధికార పార్టీ తప్ప మిగతా పార్టీలన్ని జీవో నెంబర్​ వన్​ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. జీవో నెంబర్​ వన్​కు రద్దు చేయాలని నిరసనగా.. భోగి పండగ రోజు టీడీపీ నేతలు జీవో నెంబర్​ వన్​ కాపీలను భోగి మంటల్లో వేసి కాల్చారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసినట్లు.. జీవో నెంబర్​ వన్​ కాపీలను భోగి మంటల్లో వేసినట్లు టీడీపీ తెలిపింది.

విజయవాడలోని టీడీపీ అధ్వర్యంలో భోగి మంటలు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఈ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో జీవో నెంబర్​ వన్​ కాపీలను దగ్ధం చేశారు. భోగి పండగ రోజున పనికి రాని వస్తువులను భోగి మంటల్లో కాల్చటం ఆనవాయితీ అని.. జీవో నెంబర్​ వన్​ పనికిరానిదని అందుకే భోగి మంటల్లో దగ్ధం చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో సైకో పాలన పోయి.. సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గొల్లపూడి వన్ సెంటర్లో భోగి వేడుకలలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటలలో జీవో నెంబర్ వన్​ ప్రతులను దగ్ధం చేశారు. బ్రిటిష్ కాలం నాటి చీకటి చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

పండగ పూట రైతుల కంట కన్నీరే : మచిలీపట్నంలో మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో జీవో నెంబర్​ వన్​ కాపీలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. జగన్​ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని.. నిత్యావసర ధరలు పెరిగి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రైతులు జగన్ దెబ్బకు విలవిల్లాడుతున్నారని, పండగపూట రైతుల కంట కన్నీరే మిగిలిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్కరికి కూడా సంక్రాంతి కానుక ఇవ్వలేదని విమర్శించారు.

పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భోగి మంటలు వేశారు. భోగి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. అనంతరం భోగి మంటలలో జీవో నెంబర్​ 1 కాపీలను వేసి తగలబెట్టి.. వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

కృష్ణా జిల్లా గన్నవరంలో భోగి మంటల్లో జీవో నెంబర్​ వన్​ కాపీలను టీడీపీ ఆధ్వర్యంలో కాల్చివేశారు. వీటితో పాటు టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల ఎఫ్​ఐఆర్​ కాగితాలనూ భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాల చీకటి పాలన పోయి.. మంచి పాలన రావాలని అర్జునుడు అన్నారు.

సీపీఐ ఆధ్వర్యంలో భోగి మంటల్లో జీవో నెంబర్​ వన్​ : సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్​ వన్​ కాపీలను.. భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత రామకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నెంబర్​వన్​ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని అన్నారు.

భోగి మంటల్లో జీవో నెంబర్​ 1 కాపీలు .. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకుల నిరసనలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.