ETV Bharat / state

Rosaiah funerals: రోశయ్య భౌతికకాయానికి కేసీఆర్ నివాళి.. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

author img

By

Published : Dec 4, 2021, 11:25 AM IST

Updated : Dec 4, 2021, 3:40 PM IST

rosaiah funerals
రోశయ్య మృతి

11:22 December 04

రేపు ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

Ex CM Rosaiah funerals: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మంత్రులతో కలిసి అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి చేరుకున్న సీఎం... ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చి.. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్​గా ఆయన సేవలు.. సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో రోశయ్య ప్రత్యేక శైలిని, హుందాతనాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

రేపు అంత్యక్రియలు

రేపు కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం వరకు రోశయ్య నివాసంలోనే ఆయన భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం.. గాంధీభవన్‌కు తరలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం ఉంచుతారు. ఆ తర్వాత గాంధీభవన్ నుంచి కొంపల్లి వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

Konijeti Rosaiah passed away: రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్యకు(88) ఇవాళ ఉదయం పల్స్‌ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్​లోని స్టార్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు.

ఇదీ చదవండి: Konijeti Rosaiah passed away : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత

Last Updated :Dec 4, 2021, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.