ETV Bharat / state

Dasoju Shravan Complaint : 'రేవంత్​ రెడ్డి గ్యాంగ్..​ దండుపాళ్యం బ్యాచ్​ను తలపిస్తుంది'

author img

By

Published : Jul 14, 2023, 10:20 PM IST

Dasoju Shravan Comments On Revanth Reddy : తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్​ చేస్తున్న వారిపై బీఆర్​ఎస్​ నేత దాసోజు శ్రవణ్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరించిన వారి ఫోన్​ నంబర్లు పోలీసులకు ఇచ్చారు. దాదాపు 10 మంది వివిధ నంబర్ల నుంచి కాల్స్​ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నయీం లాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు

Dasoju sravan
Dasoju sravan

Dasoju Shravan Filed Compaint Threatening Calls : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులపై.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బీఆర్​ఎస్​ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని శ్రవణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారి ఫోన్ నంబర్​లను పోలీసులకు అందజేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్​ స్టేషన్​ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

గురువారం రేవంత్​ రెడ్డి అభిమానులం అంటూ తనకు కొంత మంది వ్యక్తులు.. వివిధ నంబర్ల నుంచి కాల్స్​ చేశారని దాసోజు శ్రవణ్​కు వివరించారు. తనను తన కుటుంబ సభ్యులను చెప్పలేని విధంగా దుర్భాషలు ఆడారని పేర్కొన్నారు. అందుకే ఫోన్​ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 10 మంది వివిధ నంబర్ల నుంచి కాల్స్​ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నయీం లాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభిమానుల పేరుతో ఆయన​ భయపెట్టాలని చూస్తున్నారని వివరించారు.

Dasoju Shravan Filed Cybercrime Complaint : రాష్ట్రంలో రేవంత్​ రెడ్డి, వారి అనుచరులు దండుపాళ్యం బ్యాచ్​లా తయారయ్యిందని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ప్రజల కోసం వార్​ చేయాల్సిన వారు.. వార్​ రూమ్​లో వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి తలసాని మీద కూడా గతంలో ఇలానే దాడులు చేశారని గుర్తు చేశారు. అలాగే హనుమంతరావు, జగ్గారెడ్డిపై కూడా దాడులు జరిగాయని వెల్లడించారు.

"రాత్రి 12:15 గంటల నుంచి వేకువజామున 1:30 గంటల వరకు ఒకరి తర్వాత ఒకరు రేవంత్​ రెడ్డి అనుచరులము.. అభిమానులం అంటూ ఫోన్​ కాల్స్​ చేస్తూ దుర్భాసలాడారు. రేవంత్​రెడ్డిని విమర్శిస్తే నిన్ను చంపేస్తాం అంటూ బెదిరించారు. నా కుటుంబ సభ్యులను, నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వీరిపై క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాను. -దాసోజు శ్రవణ్​

రేవంత్​ రెడ్డికి బీసీలంటే గౌరవం లేదు : ఇప్పుడు తనపై కూడా దాడికి పాల్పడుతున్నారని.. ముఖ్యమంత్రిపై సైతం అనేక విమర్శలు చేస్తున్నారని దాసోజు పేర్కొన్నారు. రేవంత్​ రెడ్డికి బీసీలంటే గౌరవం లేదని.. బ్లాక్​ మెయిల్​ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు మూడు గంటలు కరెంట్​ చాలు అని రేవంత్​ రెడ్డి ఎలా మాట్లాడుతారని.. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి పీసీసీ అధ్యక్షుడు ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. బీజీపీకు కోవర్టుగా రేవంత్​ రెడ్డి పని చేస్తున్నారన్నారు. 50 శాతం సీట్లలో కాంగ్రెస్​ పార్టీకి అభ్యర్థులు లేరని.. రానున్న రోజుల్లో కాంగ్రెస్​కు ప్రజలే బుద్ధి చెబుతారని దాసోజు శ్రవణ్​ హెచ్చరించారు.

రేవంత్​ రెడ్డి గ్యాంగ్..​ దండుపాళ్యం బ్యాచ్​ను తలపిస్తుంది

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.