ETV Bharat / state

భారత్​బంద్​ దృష్ట్యా వాహనదారులకు సీపీ సజ్జనార్ సూచనలు

author img

By

Published : Dec 7, 2020, 7:49 PM IST

రేపు భారత్​ బంద్​ దృష్ట్యా సైబరాబాద్ సీపీ సజ్జనార్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే... కంట్రోల్​ రూం నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

CP SAJJANAR
భారత్​బంద్​ దృష్ట్యా వాహనదారులకు సీపీ సజ్జనార్ సూచనలు

భారత్‌ బంద్‌ దృష్ట్యా సైబరాబాద్‌ పరిధిలో వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. శంషాబాద్​ విమానాశ్రయానికి వెళ్లే వారు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అత్యవసర వాహనాలు, అంబులెన్స్​లు వెళ్లేందుకు అన్ని రహదారులపై సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులుంటే సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.

సైబరాబాద్‌ కంట్రోల్‌రూం నంబర్లు:

  • 040-27853413
  • 94906 17100
  • 8500 411111

ఇదీ చూడండి: మంగళవారం 'భారత్​ బంద్​'- అన్ని వర్గాల మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.