ETV Bharat / state

BRS party Joinings Latest : చేరికలపై దూకుడు పెంచిన బీఆర్​ఎస్.. ఆ రెండు జిల్లాలే టార్గెట్

author img

By

Published : Jul 27, 2023, 1:29 PM IST

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో చేరికలపై పార్టీలు ప్రధానంగా దృష్టిసారించాయి. ప్రత్యర్ధి పార్టీల్లోని బలమైన నేతలను చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీపనైపోయిందని ప్రజల్లోకి సంకేతాలు వెళ్లేలా చూస్తున్నాయి. ప్రధాన ఉమ్మడి నల్గొండ, మెదక్‌ జిల్లాలో ప్రజాప్రతినిధులపై బీఆర్​ఎస్ దృష్టిపెట్టింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నచోట ఇతర పార్టీల్లోని నేతలకి ఆహ్వానం పలుకుతోంది.

BRS
BRS

చేరికలపై దూకుడు పెంచిన బీఆర్​ఎస్.. ఆ రెండు జిల్లాలే టార్గెట్

BRS strategies for Telangana assembly elections : ఎన్నికలకు పూర్తిస్థాయిలో సయామత్తమైన బీఆర్​ఎస్ చేరికలపై మరింత దూకుడు పెంచనున్నట్లు తెలిసింది. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న కొందరు ముఖ్యనాయకులను చేర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ఉమ్మడి నల్గొండ, మెదక్‌ జిల్లాకు చెందిన కొందరు నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండి గెలిచేందుకు అవకాశం లేదని భావించిన చోట ఇతర పార్టీల్లో ప్రధాన ప్రత్యర్ధిగా ఉండి పరిస్థితిని అనుకూలంగా ఉన్నవారిని తమవైపు తిప్పుకోవాలనేది బీఆర్​ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది.

కొందరు ముఖ్యులు వస్తే ఆ పార్టీ పని అయిపోయిందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగుతుంది కనుక అలాంటివారిని చేర్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు ప్రధాన ప్రజాప్రతినిధులు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్​ఎస్ ముఖ్యనేతలుబుధవారం చేరికలపై విస్తృతంగా చర్చించారు. భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డికి టికెట్‌ గురించి ఏ హామీ ఇవ్వలేదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నా భువనగిరి ఎంపీ టికెట్‌ లేదా ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చేందుకు వీలుగా రెండు, మూడు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

Nalgonda BRS latest politics : భువనగిరి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బూరనర్సయ్య గౌడ్‌.. ఇప్పటికే బీఆర్​ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అక్కడి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాల్సిందే. గత పదేళ్లుగా విపక్షంలోనే ఉండటం, భారీగా పెరిగిన ఎన్నికల వ్యయాన్ని భరించడం నేతలకు కష్టంగా మారింది. ఒకవేళ ఖర్చు భరించి ఎన్నికల్లో గెలిచినా మళ్లీ విపక్షంలో కూర్చోవల్సి వస్తే ఏం లాభం? దానికంటే పార్టీ మారితే ఎన్నికల ఖర్చు భారం ఉండదు.

మంత్రి కావడానికి అవకాశాలుటాయని విపక్షానికి చెందిన ముఖ్యనాయకుడు ఒకరు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొన్నిచోట్ల ఇద్దరు నాయకుల మధ్య గట్టిపోటీ ఉంది. అందులో తమకు టికెట్‌ రాకపోతే అధికారపార్టీ వైపు వెళ్లే ఆలోచనలో కొందరు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాంటివారిని తమవైపు తిప్పుకోవడం ద్వారా సునాయాసంగా విజయం సాధించవచ్చనే అభిప్రాయంతో బీఆర్​ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొందరు ముఖ్యనాయకుల పేర్లపై విస్తృతంగా ప్రచారంసాగుతోంది.

Medak Latest Politics : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఓ ఎమ్మెల్యే పనితీరుపై బీఆర్​ఎస్ అధిష్ఠానం ఇటీవల గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. పనితీరు మార్చుకోకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం. అలాంటి చోట విపక్షంలోని బలమైన అభ్యర్థులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.