ETV Bharat / state

2020లోనూ ఆన్‌లైన్‌ డెలివరీలో బిర్యానీయే టాప్​

author img

By

Published : Dec 29, 2020, 12:02 PM IST

biryani
2020లోనూ ఆన్‌లైన్‌ డెలివరీలో బిర్యానీయే టాప్​

భాగ్యనగరం అంటేనే బిర్యానీ రుచులకు పెట్టింది పేరు. 2020లోనూ నగరవాసులు ఆన్‌లైన్‌ ఆర్డర్లలో బిర్యానీకే అధికంగా ఓటేయడం గమనార్హం. సాధారణ రోజులతో పోలిస్తే కొవిడ్‌ తర్వాత హోం డెలివరీలు ఐదు రెట్లు పెరిగాయి. హైదరాబాద్‌తో సహా వేర్వేరు నగరాల్లో ఆహారపు అలవాట్లపై ‘స్విగ్గీ’ స్టాట్‌ఈటిస్టిక్స్‌ పేరుతో విశ్లేషించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

భాగ్యనగరవాసులు మంచి ఆహారప్రియులు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి తిండికే పరిమితమైనా... ఇష్టమైన బిర్యానీకి దూరమైన భావన చాలామందిలో కన్పించింది. రెస్టారెంట్ల కోసం ఎదురుచూశారు. అనుమతి ఇవ్వగానే ఆన్‌లైన్‌ డెలివరీలు పెరిగాయి. శాకాహారమైనా, మాంసాహారమైనా బిర్యానీనే ఎక్కువమంది ఆరగించారు. ఎంతగా అంటే నిమిషానికి ఒక ఆర్డర్‌ చొప్పున. ఆరు మాంసాహార బిర్యానీల ఆర్డర్లు ఇస్తే అందులో ఒకటే శాకాహార బిర్యానీ. ఆన్‌లైన్‌లో పానీపూరి, సలాడ్స్‌, శాండ్‌విచ్‌ ఆర్డర్లూ పెరిగాయి.

ఉదయం ఎక్కువగా...

ఉదయం అల్పాహారాన్ని ఎక్కువమంది ఇంటికి తెప్పించుకుంటున్నారు. వీటిలో సగటు క్యాలరీలు చూస్తే 427 వరకు ఉంటున్నాయి. ఇడ్లీ, కిచిడి, కిటో శాండ్‌విచ్‌లు, సలాడ్స్‌ తీసుకుంటున్నారు.

తృణ ధాన్యాలతో

  • కొవిడ్‌తో భోజనప్రియులు ఆరోగ్యకర పదార్థాల వైపు మొగ్గారు
  • 127 శాతం.. తృణ ధాన్యాలతో తయారుచేసే రుచుల ఆర్డర్లు
  • 50 శాతం.. వేగాన్‌ వంటకాలు
  • 49 శాతం.. అధిక ప్రొటీన్‌ ఉండే రుచులు

ఎక్కువ ఆరగించినవి

చికెన్‌ బిర్యానీ
  • చికెన్‌ బిర్యానీ
  • మసాల దోశ
  • పనీర్‌ బటర్‌ మసాల
  • చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌
  • గార్లిక్‌ బ్రెడ్‌స్టిక్స్‌

అధికంగా ఆర్డర్లు ఇచ్చిన నగరాలు

  • బెంగళూరు
  • ముంబయి
  • చెన్నై
  • హైదరాబాద్
  • దిల్లీ

ఇదీ చదవండి: టేస్టీ 'మునక్కాయ మాంసం' ట్రై చేద్దామా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.