ETV Bharat / priya

టేస్టీ 'మునక్కాయ మాంసం' ట్రై చేద్దామా?

మునక్కాయ అనగానే చాలామందికి నోరూరిపోతుంది. కానీ, కొందరు మునక్కాయలను అస్సలు ఇష్టపడరు. అలాంటి వారు సైతం లొట్టలేసుకుతినాలంటే మాంసంలో మునక్కాయ కలిపి రుచి చూపించాల్సిందే. మరింకెందుకు ఆలస్యం 'మునక్కాయ మాంసం' రెసిపీ చూసేద్దాం రండి..

try-drum-stick-with-meat-recipe
టేస్టీ 'మునక్కాయ మాంసం' ట్రై చేద్దామా?
author img

By

Published : Aug 28, 2020, 1:00 PM IST

ఎన్నో పోషకాలు నిండిన మునక్కాయలను వారానికోసారైనా ఆహారంలో తీసుకోవాలంటారు వైద్యులు. మరి మాంసాహార ప్రియులు మునక్కాయను మాంసంతో కలిపి ఎలా వండుకోవాలో చూసేయండి....

కావల్సినవి

మటన్ ముక్కలు - కప్పు, ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి చొప్పున, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, అల్లం తరుగు - చెంచా, పసుపు - అరచెంచా, కారం - చెంచా, నూనె - పావుకప్పు, కరివేపాకు రెబ్బలు - రెండు, పచ్చిమిర్చి -నాలుగు, ధనియాల పొడి - చెంచా, మునక్కాయలు - రెండు, నిమ్మరసం - చెంచా, కొత్తిమీర - కట్ట, ఉప్పు- తగినంత.

తయారీవిధానం

పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. అవి ఎర్రగా వేగాక మాంసం ముక్కలూ, మునక్కాయ ముక్కలు వేసి మంట తగ్గించాలి. ఐదారు నిమిషాలయ్యాక మూత పెట్టేయాలి. కాసేపటికి ఈ రెండూ ఉడుకుతాయి. అప్పుడు అల్లం, వెల్లుల్లి తరుగు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, కాసిని నీళ్లు పోసి కలపాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. కాసేపటికి నీళ్లన్నీ ఆవిరైపోతాయి. అప్పుడు ధనియాలపొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి దింపేయాలి.

ఇదీ చదవండి: రవ్వ పులిహోర కలిపేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.