ETV Bharat / state

Bhatti Comments on YS Sharmila : 'వైఎస్​ షర్మిల కాంగ్రెస్​లో​ చేరితే ఓకే.. వైఎస్​ కుటుంబమంటే చాలా గౌరవం'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 2:59 PM IST

Bhatti Comments on YS Sharmila : వైఎస్​ షర్మిల కాంగ్రెస్​ పార్టీలో చేరతానంటే స్వాగతిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్​ కుటుంబమంటే కాంగ్రెస్​ పార్టీకి ఎప్పటికీ గౌరవమేనని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. భట్టి విక్రమార్క ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka Comments on YS Sharmila Joining Congress
Bhatti Vikramarka Comments on YS Sharmila

Bhatti Comments on YS Sharmila Joining Congress : వైఎస్​ షర్మిల కాంగ్రెస్​ పార్టీలోకి వస్తుండడం సంతోషకరంగా ఉందని.. వైఎస్​ కుటుంబమంటే కాంగ్రెస్​ పార్టీకి చాలా గౌరవమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. వారు భావోద్వేగాల వల్ల కాంగ్రెస్​ పార్టీకి కొంతకాలం దూరమయ్యారని తెలిపారు. పీపుల్స్​ మార్చ్​ పాదయాత్ర(Peoples March Padayatra) బృందం సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. భట్టి విక్రమార్క ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka on YS Sharmila : ఇప్పుడు తిరిగి వైఎస్​ షర్మిల సొంతింటికి వస్తున్నట్లు భావిస్తున్నానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హర్షించారు. కాంగ్రెస్​ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ పార్టీ.. బీజేపీకు బీ టీం లాంటి పార్టీ అని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో చీలికలు తీసుకొచ్చి.. బీజేపీకి ఉపయోగపడేందుకే బీఆర్​ఎస్​ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రానికి బీఆర్​ఎస్​ వల్ల ఒరిగేదేమీ లేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఇప్పటికే భట్టి మార్గంలోనే కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూడా షర్మిల కాంగ్రెస్​ పార్టీలో కలుస్తానంటే స్వాగతిస్తానంటూ ఆహ్వానించారు.

Telangana Politics : కేసీఆర్​కు చెక్ పెట్టేందుకు.. బీజేపీ మినహా విపక్షాలన్నీ ఒక వేదికగా ఏర్పడేందుకు సిద్ధం..!

షర్మిల చేరికపై వ్యతిరేక గళం : కానీ కాంగ్రెస్​లోనే మరో వర్గానికి చెందిన నాయకులు మాత్రం వైఎస్​ షర్మిలను పార్టీలో చేర్చుకుంటే చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యమ సమయంలో ఆమె సమైక్యాంధ్ర గళం వినిపించి.. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టి తెలంగాణలో అడుగుపెట్టాను అంటున్నారు. ఆమె కాంగ్రెస్​లో చేరితే కచ్చితంగా బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలకు బలం ఇచ్చిన వారం అవుతామని భావిస్తున్నారు. వైఎస్​ షర్మిల పార్టీలో చేరితే పాలేరు నియోజకవర్గం టికెట్​ ఇవ్వాలి.. ఇప్పుడు అదే నియోజకవర్గంలోని బలమైన నాయకుడు తుమ్మల నాగేశ్వర్​రావు పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఆ టికెట్ ​ఆయనకు ఇవ్వడానికి పార్టీ సుముఖంగా ఉంది. అందుకని ఇప్పుడు షర్మిలను పార్టీలో చేర్చుకోకుండా ఉంటేనే మంచిదని ఆ వర్గం భావిస్తోంది.

YS Sharmila Meets Rahul Gandhi : తెలంగాణలో ఈసారి ఎలాగైనా రాజన్న రాజ్యం తీసుకురావాలనే నినాదంతో.. వైఎస్సాఆర్​టీపీని స్థాపించి వైఎస్​ షర్మిల తన పార్టీని పాగా వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ.. ప్రతి నియోజకవర్గంలో కలియ తిరిగారు. సీఎం కేసీఆర్​, బీఆర్​ఎస్​ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. దీంతో తీరిక లేని సమయాన్ని గడుపుతూ.. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తూ.. సీఎం కేసీఆర్​ను మూడోసారి గెలవకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Political Heat in Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 'అసెంబ్లీ' హీట్.. ప్రజలు ఎవరివైపో మరి..?

YS Sharmila Meets Sonia Gandhi : సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ.. కాంగ్రెస్​లో YSRTP విలీనం ఖాయమేనా..?

YS Sharmila Tweet On BRS And BJP : 'గల్లీలో సిగపట్లు.. దిల్లీలో కౌగిలింతలు.. ఇది బీజేపీ, బీఆర్​ఎస్​ మైత్రి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.