ETV Bharat / state

Political Heat in Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 'అసెంబ్లీ' హీట్.. ప్రజలు ఎవరివైపో మరి..?

author img

By

Published : Aug 21, 2023, 12:15 PM IST

Assembly Elections Heat in Khammam
Assembly Elections

Political Heat in Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకోసం ముందుగా అన్ని పార్టీలు రేసు గుర్రాల కోసం కసరత్తు మొదలుపెట్టాయి. ప్రతిపక్ష పార్టీల కన్నా ముందే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైన అధికార బీఆర్ఎస్.. పార్టీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తొలిదఫాలో ఎన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు? పార్టీ అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్న అంశం ఆయా నియోజకవర్గాల్లో ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ సారి ముందే నియోజకవర్గాల వారీగా అభ్యర్థిత్వాలను ప్రకటించేందుకు ముమ్మరంగా అన్వేషిస్తున్నాయి.

Political Heat in Khammam : 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ బీఆర్ఎస్​కు దక్కింది ఒక్కస్థానమే. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి ఇప్పటికే పలుమార్లు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో ఖమ్మం వేదికగా నిర్వహించిన బహిరంగ సభ నుంచి మంత్రి హరీశ్​రావు జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించి చక్కబెడుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో ముఖ్య నాయకుల మధ్య సమన్వయం కోసం మంత్రి మంత్రాంగం నడుపుతున్నారు.

Assembly Elections Heat in Khammam : ఇవాళ, రేపటిలో అభ్యర్థుల జాబితా(BRS MLA Candidates 2023) వెలువరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేల ఆధారంగా టికెట్లు(BRS MLA Tickets Telangana 2023) కేటాయిస్తామని బీఆర్ఎస్​ అధిష్ఠానం చెప్పుకొస్తోంది. సర్వే నివేదికల ఆధారంగా 10 నియోజవర్గాల్లో అభ్యర్థుల జాబితాపై చేసిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం బీఆర్ఎస్​కు ఉమ్మడి జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇచ్చేందుకే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే.. మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలపై ఇంకా కొంత తర్జన భర్జన సాగుతుందన్న ప్రచారం సాగుతోంది. తుది జాబితాపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

BRS focus on Khammam Politics 2023 : అభ్యర్థిత్వాల ఖరారు ఇవాళ, రేపటిలో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో సిట్టింగులతో పాటు.. ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పలు నియోజకవర్గాల్లో ఎన్నికల సమన్వయం కోసం బీఆర్ఎస్ ఇంఛార్జీలను నియమించింది. వైరా-మంత్రి పువ్వాడ(Minister Puvvada Ajay), మధిర- నామా నాగేశ్వరరావు, కొత్తగూడెం-ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇల్లందు-తాతామధుసూదన్​ను ఇంఛార్జీలుగా నియమించినట్లు తెలిసింది. మిగిలిన నియోజకవర్గాలకు త్వరలోనే పార్టీ ముఖ్యనేతలను సమన్వయకర్తలుగా నియమించి అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.

BRS MLA Candidates 2023 : ఆగస్టులో BRS అభ్యర్థుల ప్రకటన.!

పొంగులేటి చేరికతో నియోజకవర్గాల వారీగా పోటాపోటీ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Telangana Congress) 6 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్​కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచేందుకు ఆశావహుల జాబితా భారీగానే ఉంది.

Khammam Politics 2023 : జిల్లాలో ఇప్పటికే సీనియర్ నేతలు మల్లు, భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి వర్గాలుగా పార్టీలో రాజకీయాలు సాగుతుండగా.. పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్​లో చేరికతో నియోజకవర్గాల వారీగా పోటాపోటీ నెలకొంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురికిపైనే ఆశావహ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షిచుకుంటున్నారు. సెప్టెంబర్ మొదటి వారం తర్వాత అభ్యర్థుల తొలిజాబితా ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో.. ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Telangana Congress Plans Assembly Elections 2023 : ఇంకొవైపు.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థిత్వాల కోసం ఈసారి దరఖాస్తులను ఆహ్వానించడంతో నాయకులు భారీగానే పోటీ పడుతున్నారు. ఈ నెల 25 వరకు దరఖాస్తులకు అవకాశం ఉండటంతో ఒక్కో నియోజకవర్గంలో మూడుకు మించి దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు కాంగ్రెస్​లో ఈ సారి తీవ్ర పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీ అధిష్ఠానం టికెట్ ఇచ్చిన అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తామని ముఖ్య నేతలంతా ప్రకటిస్తుండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే.

BJP Strategies for Telangana Assembly Elections 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి సత్తా చాటాలన్న కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యనేతల పర్యటనలతో కమలదళంలో కొంత ఊపు కనిపిస్తున్నప్పటికీ.. బలమైన అభ్యర్థుల లేమి పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. దీంతో నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం పార్టీ ముమ్మరంగా అన్వేషిస్తోంది. పార్టీ బలం చాటేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపింది.

BJP Telangana Election Plan 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. బీజేపీ 100 రోజుల ప్రణాళిక

ఎన్నికల సన్నద్ధతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించి నివేదికలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా త్వరలోనే 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల నుంచి రానున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పార్టీ స్థితిగతులు, బలమైన అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి పార్టీ నాయకత్వానికి అందించే వీలుంది. దీంతో పాటు.. ఈ నెల 27న ఖమ్మంలో అమిత్ షా సభను విజయవంతం చేసి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగాలని కమలదళ నేతలు భావిస్తున్నారు.

బీఆర్ఎస్​తో పొత్తు ఉన్నా లేకున్నా.. పోటీ చేస్తాం : సీపీఎం, సీపీఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం(CPM Leader Tammineni Veerabhadram), కూనంనేని సాంబశివరావు(CPI Leader Kunamneni Sambasiva Rao) ఉభయ జిల్లాలకు చెందిన వారే కావడంతో.. రెండు పార్టీలు ఇక్కడే ప్రధాన దృష్టి సారించాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి తమకు బలమున్న స్థానాల్లో బరిలో నిలిచి తీరుతామని నేతలు చెప్పుకొస్తున్నారు. బీఆర్ఎస్​తో పొత్తుకు అవకాశాలు ఉండటంతో.. ఎక్కడెక్కడ పోటీ(Telangana Assembly Elections 2023) చేయాలన్న అంశంపై రెండు పార్టీలు ఇంకా ఓ స్పష్టతకు రాలేదు.

బీఆర్ఎస్​తో పొత్తు ఉన్నా లేకున్నా కొత్తగూడెంలో సీపీఐ పోటీ చేస్తుందని.. అందుకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని కూనంనేని ఇటీవలే వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సీపీఎం సైతం ఉభయ జిల్లాల్లో బలమున్న స్థానాల్లో పోటీకి సై అంటోంది. అయితే పొత్తుల అంశం తేలిన తర్వాతే రెండు పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలవడంపై స్పష్టత వచ్చే వీలుంది.

ఎవరి పయనం ఎటో.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయం..!

BRS on Congress Comments : 'రైతుల శత్రువు కాంగ్రెస్.. ఫ్రీ కరెంట్​పై ఆ పార్టీది దుర్మార్గపు ఆలోచన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.