ETV Bharat / entertainment

హార్దిక్ ఆస్తుల్లో 50% 'ఆమె' పేరిటే- నెట్టింట ఇదే హాట్​టాపిక్! - Hardik Pandya Natasha Divorce

author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 9:05 PM IST

Updated : May 25, 2024, 10:33 PM IST

Hardik Pandya Natasha Divorce: హార్దిక్‌, తన భార్య నటాసాతో విడాకులు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతే కాదు ఆమెకు భరణంగా తన ఆస్తిలో 70 శాతం ఇవ్వాలని వార్తలు వస్తున్నాయి. అందరూ ఆస్తి పోగొట్టుకుంటున్నాడని పాండ్యాపై సానుభూతి చూపిస్తున్నారు. కానీ ఆ అవసరం లేదు.

Hardik Pandya Natasha Divorce
Hardik Pandya Natasha Divorce (Source: Associated Press)

Hardik Pandya Natasha Divorce: టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ ప్రచారం బయటకు రాగానే నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సడెన్‌గా ఇప్పుడు ఎక్కువ మంది హార్దిక్‌కి సపోర్ట్‌ చేస్తున్నారు. ఒకవేళ వీరికి విడాకులు మంజూరైతే, హార్దిక్‌ తన రూ.165 కోట్ల ఆస్తిలో 70 శాతం నటాషాకి భరణంగా ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌ నిజమైనా, అందరూ అనుకుంటున్నట్లు హార్దిక్‌ ఆస్తులకు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే?

ఈ రోజు కోసం ముందే సిద్ధమైన పాండ్యా? గతంలో తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వింటుంటే, ఈ రోజు కోసం పాండ్య ముందే సిద్ధమైనట్లు అనిపిస్తోంది. 2018లో గౌరవ్ కపూర్ 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' షో లో పాండ్య పాల్గొన్నాడు. అయితే వాళ్ల ఫ్యామిలీ ఆస్తులల్లో దాదాపు 50 శాతానికిపైగా తన తల్లి పేరిటే ఉన్నాయని చెప్పాడు. 'మా అన్ని అకౌంట్స్‌లో పార్ట్‌నర్‌గా ఉంటానని అమ్మ చెప్పింది. కాబట్టి నాతో పాటు, నాన్న, కృనాల్ అకౌంట్స్‌లో అమ్మ పేరు ఉంటుంది. కార్ల నుంచి ఇళ్ల వరకు ప్రతిదీ ఆమె పేరు మీద ఉంది. మేరా భరోసా నహీ (నాపై నాకు నమ్మకం లేదు). నా పేరు మీద నేను ఏమీ తీసుకోను. ఫ్యూచర్‌లో ఎవ్వరికీ 50% ఇవ్వాలనుకోను (నవ్వుతూ). ఏదైనా జరిగినా నేను దాన్ని కోల్పోకుండా ఉండటానికి 50% మీ పేరిట ఉంచుకోమని చెప్పాను' అని అన్నాడు.

కాగా, ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాండ్య ముందునుంచే సేఫ్​గా ఉన్నాడని నెటిజన్లు అంటున్నారు. ఒకవేళ నిజంగానే హార్దిక్ పాండ్యా తన తల్లిని ఆస్తులన్నింటిలో సమాన భాగస్వామిని చేసి ఉంటే, ఈ విడాకుల ఊహాగానాలు నిజమైతే అతడు తన సంపదను కాపాడుకునే అవకాశం ఉంది అని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ రూమర్లు ప్రచారంలో ఉండగా, శనివారం నటాషా మరో వ్యక్తి లంఛ్ టైమ్​లో కనిపించడం చర్చనీయంగా మారింది. దీనిపై వాళ్లే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

భార్యతో విడాకులు​ - భరణం కింద ఆస్తుల్లో 70 శాతం ఇవ్వనున్న హార్దిక్​! - Hardik Natasa divorce

వాలెంటైన్స్​ డే స్పెషల్​.. మళ్లీ పెళ్లి చేసుకున్న హార్దిక్​ పాండ్య.. ఫొటోలు చూశారా?

Last Updated : May 25, 2024, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.