ETV Bharat / state

'తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. నిలకడగానే ఆరోగ్యం'

author img

By

Published : Jan 29, 2023, 1:23 PM IST

Updated : Jan 29, 2023, 2:04 PM IST

'తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. నిలకడగానే ఆరోగ్యం'
'తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. నిలకడగానే ఆరోగ్యం'

Nandamuri Tarakaratna Health Condition: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ, జూనియర్​ ఎన్టీఆర్​ స్పందించారు. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు.

'తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. నిలకడగానే ఆరోగ్యం'

Nandamuri Tarakaratna Health Condition: నందమూరి తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. చికిత్సకు స్పందిస్తున్నారని.. ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగ్గానే ఉందని వెల్లడించారు. తారకరత్నకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని.. ఆయన త్వరలోనే కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని బాలకృష్ణ కోరారు.

నిలకడగానే ఆరోగ్యం..: తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని జూనియర్​ ఎన్టీఆర్​ వెల్లడించారు. తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. తనకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. కుటుంబసభ్యులు అందరం తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. అందరి ఆశీస్సులు తారకరత్నకు కావాలని కోరారు. కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్​ ఎంతో సహకారం అందిస్తున్నారని ఎన్టీఆర్​ వివరించారు.

అంతకుముందు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తమ కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తారకరత్న కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్‌ కూడా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఏం జరిగిందంటే?: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. పల్స్‌ పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 29, 2023, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.