ETV Bharat / state

రేపటి నుంచే ఐదో తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ!

author img

By

Published : Mar 9, 2021, 6:45 PM IST

గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష కోసం బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకి అర్హులని ప్రధాన కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మొత్తం 46,937 సీట్ల ఖాళీలున్నట్లు వెల్లడించారు.

applications-start-from-march-1o-to-april-3-for-tgcet-in-telangana-for-fifth-class-admissions
బుధవారం నుంచే ఐదో తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ!

గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష కోసం బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 30న టీజీసెట్ జరగనుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రధాన కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతి టీజీసెట్ రాసేందుకు అర్హులని తెలిపారు.

ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లోని 46,937 ఐదో తరగతి సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలను గురుకులాల వెబ్‌సైట్లు లేదా 1800 425 45678 టోల్ ఫ్రీ నంబరు ద్వారా తెలుసుకోవచ్చునని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు

  • ఎస్సీ- 18,560,
  • ఎస్టీ- 4,777,
  • బీసీ- 20,800,
  • జనరల్- 2,800

ఇదీ చదవండి: 'ధాన్యం సేకరణ కేంద్రాలు మూసేస్తామని తెలంగాణ చెప్పలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.