ETV Bharat / state

బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్.. ఏమన్నారంటే!?

author img

By

Published : Jun 4, 2022, 5:08 PM IST

Anand mahindra tweet on hyderabad pub minor girl gang rape case
బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్.. ఏమన్నారంటే!?

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. హైదరాబాద్‌లో బాలికపై 'పలుకుబడి' ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పరిధిలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహేంద్ర.. హైదరాబాద్‌లో బాలికపై 'పలుకుబడి' ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. '' ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదు అని నా అభిప్రాయం. ఆ యువకులు 'పలుకుబడి' ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవత విలువలు లేని, సరైన పెంపకం తెలియని దిగువ స్థాయి కుటుంబాల వారు అనడం సరైంది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా...'' అని ట్వీట్ చేశారు.

  • I don’t know these boys but may I suggest that the headline is inappropriate? These boys are not from ‘influential’ families but from ‘poor’ families. Families that are ‘poor’ in culture, upbringing & human values. May justice be delivered. https://t.co/Z22kok8cp1

    — anand mahindra (@anandmahindra) June 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలు ఇదీ జరిగిందీ... పబ్‌లో పరిచయమైన ఒక బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు. వీరిలో సాదుద్దీన్‌ మాలిక్‌ అనే యువకుడిని శుక్రవారం రోజున పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఓ మైనర్​ను హైదరాబాద్​లో అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు సమాచారం. కర్ణాటకలో తల దాచుకున్న ఉమర్​ఖాన్​ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మైనర్​లను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ అరెస్టులపై స్పష్టత లేదు. పోలీసులు మాత్రం తాము ఇప్పటివరకు ముగ్గురునే అరెస్ట్ చేశామని చెబుతున్నారు.

ఇవీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌... పోలీసుల అదుపులో నిందితులు!

కన్నబిడ్డపై రేప్.. తల్లిదండ్రులకు మరణ శిక్ష.. లిఫ్ట్​లో బాలికకు వేధింపులు

పీరియడ్స్​ను మహిళా అథ్లెట్స్​ ఎలా మేనేజ్‌ చేస్తారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.