కాంగ్రెస్ అధికారంలోకి రాగానే - ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా : రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే - ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా : రేవంత్‌రెడ్డి
Revanth Reddy Speech in Boath Meeting Today : కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైపోయిందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దొరల పాలన పోయి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Revanth Reddy Speech in Boath Meeting Today : ఆదివాసీలు, లాంబాడాలు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటివారని.. రేవంత్‌రెడ్డి(Revanth reddy) పేర్కొన్నారు. బోథ్‌లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. కేసీఆర్(CM KCR) వల్ల బోథ్‌కు నీళ్లు రాలేదని దుయ్యబట్టారు. బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని.. జిల్లాను దత్తత తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. బలరాం నాయక్ పెద్ద మనసుతో ఆదివాసీ బిడ్డకోసం ఇల్లందు సీటు వదులుకుండని.. పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని ఆయన తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారన్నారు. ఓటు చీలిపోకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదని అడిగారు. తండాలను పంచాయితీలు చేశామని చెప్పుకునే కేసీఆర్.. ఇంతవరకు ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారన్నారు.
Revanth Reddy Comments on CM KCR : గ్రామ సర్పంచులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వక ప్రభుత్వం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పిందని మండిపడ్డారు. కేసీఆర్ తన మేధస్సును రంగరించి కాళేశ్వరం కట్టిన అని చెప్తుండు.. కానీ మేడిగడ్డ కట్టిన మూడేళ్లలో కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయిందని విమర్శించారు. బోథ్‌కు నీళ్లు రాకపోవడానికి ఈ దద్దమ్మ సీఎం కేసీఆరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
Congress Election Campaign : బోథ్‌కు డిగ్రీ కాలేజీ రావాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలని పేర్కొన్నారు. ఒక్కసారి ఈ బోథ్ గడ్డపై కాంగ్రెస్‌ను గెలిపించాలని.. డిసెంబర్ 31 లోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేసే జిమ్మేదారి తనదని హామీ ఇచ్చారు. కుఫ్టీ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవానికి వస్తానని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట అడవుల వరకు కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో దొరలపాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.
రాష్ట్ర సాధనలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదని రేవంత్ మండిపడ్డారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా.. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియమ్మని.. ఆమె ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో.. కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుట్టిందని దుయ్యబట్టారు.
"కేసీఆర్ వల్ల బోథ్‌కు నీళ్లు రాలేదు. రాష్ట్రంలో దొరల పాలన పోయి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి. అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని.. అభివృద్ధి పథంలోకి నడిపిస్తాను. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను అమలు చేసి తీరుతాం". - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా రేవంత్‌రెడ్డి
