ETV Bharat / sports

నేను 'గే'.. స్టార్ ఫుట్​బాలర్ సంచలన ట్వీట్​​.. ఆ తర్వాత సూపర్​ ట్విస్ట్​!

author img

By

Published : Oct 10, 2022, 12:15 PM IST

Iker Casillas gay tweet viral
ఇకర్ కాసిల్లా గే ట్వీట్​ వైరల్​

స్పెయిన్ లెజెండరీ ఫుట్​బాలర్​ ఇకర్ కాసిల్లాస్ తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాన్ని సోషల్​మీడియా ద్వారా తెలిపాడు. ఆ తర్వాత దాన్ని డిలీట్​ చేశాడు. ప్రస్తుతం ఆ విషయంలో సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారింది.

స్పెయిన్ లెజెండరీ ఫుట్​బాలర్​ ఇకర్ కాసిల్లాస్ సంచలన ట్వీట్ చేశాడు. తాను గే (స్వలింగ సంపర్కుడు) అని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. 'మీరు నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నాను, నేను గేను' అని పేర్కొన్నాడు. ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని గోప్యంగా దాచినందుకు నా పట్ల ద్వేషభావాన్ని ప్రదర్శించబోరని అనుకుంటున్నా అంటూ వెల్లడించాడు. ఈ ట్వీట్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. దీంతో అతడికి పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. అతని మద్దతుదారుల్లో బార్సిలోనా మాజీ కెప్టెన్ కార్లెస్ పుయోల్ కూడా ఉన్నాడు.

ట్వీట్​లో ట్విస్ట్​.. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇకర్ కాసిల్లాస్ సోషల్ మీడియాలో తాను గేనంటూ పేర్కొన్న ట్వీట్ తర్వాత డిలీట్ చేశాడు. అయితే గతేడాది తన భార్య సారాతో విడిపోయాక.. కాసిల్లాస్​ నటి అలెజాండ్రా ఒనీవాతో రిలేషన్​లో ఉన్నాడని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే అతడు ఈ రూమర్స్​కు చెక్​ పెట్టి టాపిక్ డైవర్ట్​ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రాంక్​ ట్వీట్​​ చేశాడని నెటిజన్లు భావించారు. మరోవైపు అతడి అకౌంట్​ హ్యాక్​ అయిందని కూడా వార్తలు వచ్చాయి.

Iker Casillas gay tweet viral
ఇకర్ కాసిల్లాస్ గే ట్వీట్​ వైరల్​

కాగా, ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ అయిన రియల్ మాడ్రిడ్‌కు చాలా ఏళ్లుగా గోల్ కీపర్‌గా సేవలందించాడు కాసిల్లాస్. అలాగే స్పెయిన్ జాతీయ జట్టు తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. ఓ ప్రపంచ‌కప్, రెండు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లు, ఐదు లా లిగా ఛాంపియన్‌షిప్‌లు, మూడు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను గెలుపొందిన జట్టులో కీలక సభ్యుడిగా కాసిల్లాస్ ఉన్నాడు. అతడు​ గతంలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ సారా కార్బోనెరోను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు 2021 మార్చిలో విడిపోయారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు.

ఇదీ చూడండి: 'కోహ్లీ చేసిన ఆ రెండు సెంచరీలు నా ఫేవరెట్.. మళ్లీ ఆ మ్యాజిక్​ చూడాలని ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.