ETV Bharat / sports

'కోహ్లీ చేసిన ఆ రెండు సెంచరీలు నా ఫేవరెట్.. మళ్లీ ఆ మ్యాజిక్​ చూడాలని ఉంది'

author img

By

Published : Oct 10, 2022, 8:50 AM IST

ఆధునిక క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీని అధిగమించేవారెవరూ లేరని భారత మాజీ కోచ్‌ ఇయాన్‌ చాపెల్‌ పేర్కొన్నాడు. అతడు అత్యంత పోటీతత్వ స్వభావం కలిగిన ఆటగాడని కొనియాడాడు. ఇంకా ఏమన్నాడంటే?

indian-team-former-coach-on-kohli
indian-team-former-coach-on-kohli

విరాట్‌ కోహ్లీ, బాబర్‌ ఆజామ్‌, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్, మార్నస్‌ లబుషేన్‌‌.. ఈ సమకాలీన క్రికెట్‌లో వీరిలో ఉత్తమ బ్యాటర్‌ ఎవరంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, విరాట్‌ కోహ్లీ ఈ అందరికంటే ఉత్తమ గణాంకాలు నమోదు చేసినప్పటికీ.. కొన్నాళ్లపాటు ఫామ్‌ కోల్పోయాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆసియా కప్‌లో సెంచరీ నమోదు చేసి తిరిగి ఫామ్‌ సాధించాడు. కాగా ఈ అందరి ఆటగాళ్ల గురించి భారత మాజీ కోచ్‌ ఇయాన్‌ చాపెల్‌ స్పందించాడు. వీరంతా తమ అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తున్నారని, కానీ వీరెవరూ విరాట్ కోహ్లీని అధిగమించలేరని పేర్కొన్నాడు.

"నాటి క్రికెటర్లలో ఎవరు మేటి అని ప్రశ్నిస్తే సర్‌ బ్రాడ్‌మన్‌ అని చెప్పేయొచ్చు. కానీ ఈ ఆధునిక క్రికెట్‌లో పైజాబితాలో ఎవరు ఉత్తమం అంటే ఎంచుకోవడం కష్టమే. కానీ విరాట్‌ కోహ్లీని అధిగమించడం చాలా కష్టం. అతడు అత్యంత పోటీతత్వ స్వభావం కలిగిన ఆటగాడు. బ్యాటింగ్‌లో అతడి ఆలోచన విధానం ఉత్తమంగా ఉంటుంది. 2014లో అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు నా ఫేవరేట్‌గా నిలిచిపోయాయి" అని పేర్కొన్నాడు. అయితే, కెప్టెన్సీని వదులుకున్న తర్వాత విరాట్‌ ఆట కాస్త పడిపోయిందని, తిరిగి తన మ్యాజిక్‌ను ప్రదర్శిస్తే చూడాలనివుందన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.