ETV Bharat / sports

రెజ్లర్​ సాగర్​ హత్య కేసు: కోచ్​ సుభాష్​ అరెస్ట్​

author img

By

Published : Jun 16, 2021, 7:56 PM IST

రెజ్లర్​ సాగర్ రాణా​ హత్య కేసులో జూడో కోచ్​ సుభాష్​ను దిల్లీ క్రైమ్​బ్రాంచ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. రెజ్లర్​ సుశీల్​ కుమార్​(Sushil Kumar) సన్నిహితుడైన సుభాష్​​.. సాగర్​పై దాడికి పాల్పడిన వారిలో ముఖ్యుడని తెలిపారు.

Judo coach subhash Arrest
జూడో కోచ్​ సుభాష్​ అరెస్ట్​

రెజ్లర్​ సాగర్​ హత్య కేసు(Chhatrasal Brawl Case)లో జూడో కోచ్​ సుభాష్​ను దిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు అరెస్టు చేశారు. సాగర్​పై దాడి చేసిన వారిలో సుశీల్​ సన్నిహితుడైన సుభాష్​ ముఖ్యుడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సుశీల్​ కుమార్​తో సహా 11 మందిని అరెస్టు చేశారు.

ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తును దిల్లీ పోలీసులు ముమ్మరం చేశారు. సుశీల్​ పరారీలో ఉన్నప్పుడు అతనికి సహాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అయితే సాగర్​ హత్య కేసులో 13 మంది ప్రమేయం ఉన్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించగా.. ఇప్పటివరకు వారిలో 11 మందిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: రెజ్లర్​ సాగర్​ హత్య కేసు: సుశీల్​ సన్నిహితుడు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.