ETV Bharat / sports

కెనడా ఓపెన్​పై సింధు గురి.. ఈసారైనా టైటిల్‌ సాధించేనా?

author img

By

Published : Jul 3, 2023, 7:09 PM IST

Canada Open Badminton 2023
పీవీ సింధు కెనడా ఓపెన్ ఛాంపియన్​షిప్ 2023

Canada Open Badminton 2023 : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జులై 4న ప్రారంభమయ్యే కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 ఛాంపియన్​షిప్​లో ఆడనుంది​. గాయం నుంచి కోలుకున్న సింధు.. ఇప్పటివరకు ఒక్క టైటిల్​ కూడా గెలవలేదు. ఈ టోర్నీలో రాణించి ర్యాంకింగ్స్​లో మెరుగుపడాలని భావిస్తోంది.

Commonwealth Games 2022 : కెనడాలోని కాల్గరీ వేదికగా జులై 4న ప్రారంభం కానున్న కెనడా ఓపెన్​ వరల్డ్​ టూర్​ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ ఈవెంట్​​లో రాణించి.. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్​లో మెరుగుపడాలని భావిస్తోంది. ఈ టోర్నీలో సింధుతో పాటు స్టార్​ షట్లర్​ లక్ష్య సేన్ కూడా పాల్గొననున్నాడు.

అయితే, గాయం నుంచి కొలుకున్న సింధు.. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్​లో తిరిగి షటిల్ పట్టుకుంది. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో సింధుకు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత ఏప్రిల్​లో జరిగిన మాడ్రిడ్​ మాస్టర్స్​ సూపర్​ 300 ఈవెంట్​లో ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత జరిగిన రెండు టోర్నీల్లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించింది. మరో ఈవెంట్​లో రెండో రౌండ్లో ఇంటిదారి పట్టింది. దీంతో కెనడా ఓపెన్​పై భారీ ఆశలు పెట్టుకుంది సింధు. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్​ కూడా పురుషుల సింగిల్స్​ ర్యాంకిగ్స్​లో టాప్​ -10 నుంచి పడిపోయాడు. ప్రస్తుతం అతడు 19 ర్యాంక్​లో కొనసాగుతున్నాడు.

సింధు కొత్త కోచ్..
PV Sindhu New Coach : పీవీ సింధు తన కోచ్​ను మార్చనుంది. పారిస్​ ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్​ను టార్గెట్​గా పెట్టుకున్న సింధు.. మహమ్మద్‌ హఫీజ్‌ హషీమ్‌ను కొత్త కోచ్​గా నియమించుకోవాలనుంటోంది. మలేషియాకు చెందిన మహమ్మద్‌ హఫీజ్‌.. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ మాజీ ఛాంపియన్‌. అతడి దగ్గర ట్రెయినింగ్ పొందడానికి అనుమతి ఇవ్వాలంటూ.. సింధు రీసెంట్​గా భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)కు లేఖ రాసింది.

ఒలంపిక్స్​ 2024కు క్వాలిఫయర్స్​ మే 1న ప్రారంభమయ్యాయి. ఇవి వచ్చే ఏప్రిల్ 28 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు వారాల నుంచి సింధు.. సుచిత్ర అకాడమీలో హఫీజ్‌ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తోంది. హఫీజ్​కు గతంలో మలేసియా బ్యాడ్మింటన్‌ సంఘం జూనియర్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కాగా ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో అవధె వారియర్స్‌కు కోచ్‌గా పని చేశాడు.

PV Sindhu Injury : గతేడాది ఆగస్టులో జరిగిన కామన్​వెల్త్​ గేమ్స్​లో పీవీ సింధుకు గాయం అయింది. దాదాపు ఐదు నెలల పాటు సింధు ఇంట్లోనే ఉంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్​లో తిరిగి షటిల్​ పట్టుకున్న సింధు ఓటమి పాలైంది. అదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్​లో కూడా ఓడిపోయింది. 2023 మార్చి ఆరంభంలో జరిగిన ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​ నుంచి మొదటి రౌండ్​లోనే బయటకు వచ్చేసింది పీవీ సింధు. ఆ తర్వాత జరిగిన స్విస్​ ఓపెన్ సూపర్​ 300​లో టైటిల్​ చేజార్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.