ETV Bharat / sports

సింధు, సేన్​ శుభారంభం.. క్వార్టర్స్​కు చేరుకున్న భారత ప్లేయర్లు..

author img

By

Published : Jul 7, 2023, 1:29 PM IST

Etv Bharat
Etv Bharat

Canada Open 2023 : కెనడా ఓపెన్‌ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, లక్ష్యసేన్​ తమ ఆట తీరుతో దుసుకెళ్లి క్వార్టర్ ఫైనల్స్​కు చేరుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

PV Sindhu Canada Open : కెనడా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న పురుషుల, మహిళల సింగిల్స్​లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్ దూసుకెళ్తున్నారు. ఆటలో తమదైన స్టైల్​లో రాణించిన ఈ ప్లేయర్స్​.. పోటీల్లో నెగ్గి క్వార్టర్ ఫైనల్స్‌ వైపుకు అడుగులేశారు. గురువారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో సింధుకు వాకోవర్ లభించింది. జపాన్ స్టార్ నత్సుకి నిదైర గాయంతో తప్పుకోవడం వల్ల మ్యాచ్ ఆడకుండానే సింధు విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సింధు తన ప్రత్యర్థైన జపాన్‌కు చెందిన నట్సుకి నిదైరాపై గెలుపు సాధించగా..రానున్న మ్యాచ్​లో సింధు.. 2022 ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ గావో ఫాంగ్ జీతో తలపడనుంది.

ఇక బుధవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్​లో నాలుగో సీడ్‌ సింధు 21-16, 21-9తో కెనడా ప్లేయర్​ తాలియాపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో ఆధిపత్యాన్ని కొనసాగించడం వల్ల.. గేమ్​ ఏకపక్షంగా ముగిసింది. అయితే కెనడా ప్లేయర్ తాలియా ఏ దశలోనూ సింధుకి పోటీ ఇవ్వలేకపోయింది. డ్రాప్ షాట్లు, సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్​లతో సింధు దూసుకుపోగా.. ప్రత్యర్థి ఆ తాకిడికి తేలిపోయింది. కాగా, రుత్విక శివాని 12-21, 3-21తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిడా కటెథోంగ్‌ చేతిలో ఓడి పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస గేమ్‌ల్లో చిత్తయ్యింది.

అటు సింధు.. ఇటు సేన్​..
Lakshya Sen Canada Open : మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత యువ కెరటం లక్ష్యసేన్ సంచలన విజయాని అందుకున్నాడు. లక్ష్య్ సేన్ 31 నిమిషాల్లో బ్రెజిల్‌కు చెందిన యోగోర్ కొయెల్హోపై 21-15, 21-11 తేడాతో విజయాన్ని అందుకున్నడు. ఇంతకుముందు ఈ టోర్నిలో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కున్లావుత్‌ వితిద్సర్న్​కు లక్ష్యసేన్‌ ఊహించని షాకిచ్చాడు. తొలి రౌండ్​లో సేన్‌ 21-18, 21-15తో రెండో సీడ్‌ కున్లావత్‌ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. కున్లావుత్‌పై ఆడి తన రికార్డును 4-5తో మెరుగుపరుచుకున్నాడు.

ఇక రెండు గేమ్‌ల్లో కున్లావత్‌కు లక్ష్యసేన్ తనదైన స్టైల్​లో ఆడి చుక్కలు చూపించాడు. మెరుగైన ఆటతో ప్రత్యర్థికి చెమటలు పట్టేలా చేశాడు. తిరుగులేని బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థిని ఓడించి మరీ ప్రీక్వార్టర్‌కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో వైగర్‌తో లక్ష్యసేన్‌ పోటీపడనున్నాడు. అతనిపై లక్ష్యసేన్‌కు 3-0తో మెరుగైన రికార్డు ఉంది. మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత్‌ 12-21, 17-21తో వైగర్‌ కోలో (బ్రెజిల్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.