ETV Bharat / bharat

మీ బెడ్​ సందుల్లో కీటకాలు ఉన్నాయా? - ఈ టిప్స్‌ పాటిస్తే ఒక్కటి కూడా ఉండదు! - tips to avoid bedbugs

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 9:40 AM IST

Bedbugs
How To Get Rid Of Bedbugs (ETV Bharat)

How To Get Rid Of Bedbugs : మీ ఇంట్లో నల్లుల బెడద ఎక్కువగా ఉందా ? ఎన్ని పురుగు మందులు వాడినా కూడా మళ్లీ వస్తున్నాయా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! కొన్ని చిట్కాలు పాటించడం వల్ల నల్లులను ఇంట్లో నుంచి ఈజీగా తరిమికొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో మీకు తెలుసా ?

How To Get Rid Of Bedbugs : ఇంట్లో నల్లులు, ఇతర కీటకాలు ఉన్నవారి బాధ గురించి చెప్పల్సిన పనిలేదు. రాత్రి పడుకున్న తర్వాత వచ్చి రక్తం పీల్చుతాయి. ఇవి కుట్టడం వల్ల చర్మంపై దురద, మంట, ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా.. ఇవి పగలంతా గోడ పగుళ్లలో, వాల్‌పేపర్‌ కింద, పరుపుల సందుల్లో, దుప్పట్లు, తలుపు సందుల్లో, ఫర్నిచర్‌పై ఉంటాయి. రాత్రి కాగానే బెడ్​ మీదకు వచ్చేస్తుంటాయి.

అయితే.. వీటిని తరిమికొట్టడానికి చాలా మంది క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తుంటారు. దీనివల్ల నల్లులు చనిపోవడమేమో గానీ, మన ఆరోగ్యం చెడిపోతుంది. అందుకే నేచురల్ పద్ధతుల్లో.. వంటింటి చిట్కాల ద్వారానే వీటిని ఈజీగా తరిమికొట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

వ్యాక్యూమ్ క్లీనర్‌తో :
మీ ఇంట్లో నల్లుల బెడద ఎక్కువగా ఉంటే.. అవి ఉన్న చోట వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి. సోఫా సెట్‌, గది మూలలు, అల్మారాలు, కుర్చీలు, మంచం మూలలు, పరుపు, దుప్పట్లు ఇలా అన్ని చోట్లా వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో నల్లులు ఫ్లోరింగ్ పగుళ్లలోనూ దాక్కునే అవకాశాలుంటాయి. ఇలా పగుళ్లు ఉన్నచోట క్లీన్‌ చేసి ప్లాస్టర్ లేదా గ్లూను ఉపయోగించి వాటిని మూసేయండి. తర్వాత డిస్‌-ఇన్ఫెక్టంట్‌ ఫ్లోర్‌ క్లీనర్‌తో ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోతుందని నిపుణులంటున్నారు.

జర్నీ చేస్తే వాంతులు, తల తిరుగుతోందా? - ఈ టిప్స్‌ పాటిస్తే ప్రాబ్లమ్​ క్లియర్! - how to stop vomiting in travelling

వేడి నీళ్లతో :
బెడ్‌రూమ్‌లోని దుప్పట్లు, బెడ్‌కవర్స్‌, పిల్లో కవర్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. అలాగే వారానికి ఒకసారి వేడి నీళ్లలో ఉతకడం వల్ల నల్లులుంటే సులభంగా వదిలిపోతాయి.

సూర్యరశ్మి ప్రసరించేలా :
ఎక్కువ వేడిని కీటకాలు తట్టుకోలేవు. అందుకే.. ఇంట్లోకి ఉదయాన్నే సూర్యరశ్మి ప్రసరించేలా ఏర్పాటు చేసుకుంటే వాటి బెడద తగ్గుతుంది. ఒకవేళ పరుపు, మంచంపై ఉంటే వాటిని ఎండలో ఉంచాలి. తర్వాత ఒకసారి వ్యాక్యూమ్ క్లీనర్‌తో బాగా శుభ్రం చేయాలి.

సుగంధ ద్రవ్యాలతో :
ఇవి సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే వాసనను తట్టుకోలేవు. కాబట్టి దుప్పట్లు, బెడ్‌కవర్లు ఉతికిన తర్వాత సువాసన వచ్చే ఫ్యాబ్రిక్ కండిషనర్‌లో ముంచండి. అలాగే లావెండర్ నూనెకి నశిస్తాయని నిపుణులంటున్నారు. కాబట్టి, ఒక వస్త్రాన్ని లావెండర్‌ నూనెలో ముంచి కుర్చీలు, మంచాలను తుడవాలి.

  • ఇంకా పూదీనా ఆకులను కీటకాలు ఎక్కువగా ఉన్నచోట పెట్టడం వల్ల కూడా అవి నశిస్తాయి.
  • అలాగే మిరియాలు, యూకలిప్టస్ ఆయిల్‌తోనూ చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకొని దుస్తుల మడతల్లో, పరుపు కింద అక్కడక్కడా చల్లుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే వాటి బెడద తగ్గిపోతుంది.
  • మంచానికి నల్లులు, చెదపురుగుల వంటివి పడితే కొద్దిగా వేప నూనెను మూలల్లో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • అలాగే వెనిగర్, బేకింగ్‌ సోడా మిశ్రమాన్ని బాటిల్‌లో పోసుకుని బెడ్‌రూమ్‌లో స్పే చేస్తే కూడా నశిస్తాయి.
  • పెప్పర్‌మింట్‌ నూనెను అప్లై చేయడం వల్ల.. దాని నుంచే వచ్చే వాసనకూ అవి పారిపోతాయి.

వంట గది నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోందా? - ఇలా చేస్తే చిటికెలో సువాసన వెదజల్లుతుంది! - tips to remove bad smell in kitchen

ఇంట్లో టైల్స్ మధ్య మురికి పేరుకుపోయిందా? - ఈ టిప్స్​ పాటిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి! - Tips to Clean Dust Between Tiles

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.