ETV Bharat / business

అక్షయ తృతీయ ఎఫెక్ట్​ - బంగారం@రూ.74,770 & వెండి @రూ.86,389 - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 9:35 AM IST

Updated : May 10, 2024, 10:23 AM IST

Gold Price Today May 10, 2024
Gold Rate Today May 10, 2024 (ETV Bharat)

Gold Rate Today May 10, 2024 : అక్షయ తృతీయ సందర్భంగా దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today May 10, 2024 : అక్షయ తృతీయ సందర్భంగా దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,855 ఉండగా, శుక్రవారం నాటికి రూ.915 పెరిగి రూ.74,770కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.84,260 ఉండగా, శుక్రవారం నాటికి రూ.2,172 పెరిగి రూ.86,432కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad May 10, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,770గా ఉంది. కిలో వెండి ధర రూ.86,432గా ఉంది.
  • Gold Price In Vijayawada May 10, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,770గా ఉంది. కిలో వెండి ధర రూ.86,432గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam May 10, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,770గా ఉంది. కిలో వెండి ధర రూ.86,432గా ఉంది.
  • Gold Price In Proddatur May 10, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,770గా ఉంది. కిలో వెండి ధర రూ.86,432గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price May 10, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2317 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 35 డాలర్లు పెరిగి 2352 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.38 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 10, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.49,76,001
ఇథీరియంరూ.2,50,000
టెథర్రూ.79.55
బైనాన్స్ కాయిన్ రూ.47,524
సొలోనా రూ.12,110

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today May 10, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం వల్ల, నిన్నటి భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 502 పాయింట్లు లాభపడి 72,911 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 153 పాయింట్లు వృద్ధిచెంది 22,111 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్​, నెస్లే ఇండియా, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​, ఏసియన్ పెయింట్స్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​ఇన్ఫోసిస్​, ఎల్​ అండ్ టీ, హెచ్​సీఎల్ టెక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, విప్రో

రూపాయి విలువ
Rupee Open May 10, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 10, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices May 10, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.55 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 84.34 డాలర్లుగా ఉంది.

బంగారు నగలు కొనాలా? ఆభరణాల ధరలను ఎలా లెక్కించాలో తెలుసుకోండిలా! - Gold Jewellery Cost Calculation

ఎల్‌ఐసీ పాలసీ కొంటున్నారా? క్లెయిమ్​​ సెటిల్‌మెంట్ గురించి ఇవి తెలుసుకోవాల్సిందే! - LIC Claims Settlement Procedure

Last Updated :May 10, 2024, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.