ETV Bharat / sports

వెస్టిండీస్‌ టూర్​లో రోహిత్​ సేన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

author img

By

Published : Jul 9, 2023, 12:57 PM IST

Updated : Jul 9, 2023, 2:36 PM IST

west indies vs team india : టీమ్‌ఇండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో రానున్న మ్యాచ్​లకు సంబంధించిన తాజా షెడ్యూల్​ను ఐసీసీ విడుదల చేసింది. ఆ షెడ్యూల్​ మీ కోసం..

india tour of westindies
india tour of westindies schedule

India Vs West indies : ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత దాదాపు నెల రోజులపాటు విశ్రాంతి తీసుకున్న టీమ్‌ఇండియా జట్టు త్వరలో తిరిగి ప్రొఫెషనల్ క్రికెట్‌ ఆడనుంది. ఈ క్రమంలో భారత జట్టు ఇప్పుడు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది. అక్కడ కరేబియన్‌ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లను అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించనున్నారు. మిగతా అన్ని మ్యాచ్‌లు విండీస్‌లోనే జరగనున్నాయి. ఇక టెస్ట్​ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. వన్డేలు రాత్రి 7:00 గంటలకు మొదలుకానున్నాయి.

మరోవైపు టీ20ల విషయానికి వస్తే.. ఈ మ్యాచ్​లు సుమారు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహిస్తాడు. టీ20ల్లో సారథ్య బాధ్యతలను ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య చూసుకుంటాడు.

అన్ని మ్యాచ్‌లను దూరదర్శన్ నెట్‌వర్క్‌ అయిన డీడీ స్పోర్ట్స్‌ ఛానల్‌లో ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు. డిజిటల్‌గా అయితే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ అనే రెండు యాప్‌లలో ఈ మ్యాచ్​లు స్ట్రీమింగ్​ కానున్నాయి.

భారత్, వెస్టిండీస్‌ 100 టెస్టులు

India Tour of West indies : ఈ రెండు టెస్ట్​ల సిరీస్‌తో ఇరు దేశాల మధ్య టెస్టు మ్యాచ్‌ల సంఖ్య 100కు చేరుతుంది. ఇప్పటివరకు భారత్‌, వెస్టిండీస్‌ జట్లు98 టెస్ట్​లు ఆడగా.. 22 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా నెగ్గగా.. 30 మ్యాచ్‌ల్లో విండీస్‌ గెలుపొందింది. ఇక మిగిలిన 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కరేబియన్‌ జట్టుతో భారత్ ఇప్పటివరకు 139 వన్డేలు ఆడింది. 70 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా విజయం సాధించగా.. 63 మ్యాచ్‌ల్లో విండీస్​దే పై చేయిగా నిలిచింది. అయితే రెండు మ్యాచ్‌లు టై గా ముగియగా.. నాలుగింటిలో ఫలితం తేలలేదు. ఇరుదేశాలు 25 టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్‌ ఏకంగా 17 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. విండీస్ 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు.

టెస్ట్​ సిరీస్‌

  • జులై 12-16 తొలి టెస్టు (డొమినికా)
  • జులై 20-24 రెండో టెస్టు (ట్రినిడాడ్)
  • వన్డే సిరీస్‌
  • జులై 27 మొదటి వన్డే (బార్బడోస్‌)
  • జులై 29 రెండో వన్డే (బార్బడోస్‌)
  • ఆగస్టు 01 మూడో వన్డే (ట్రినిడాడ్)

టీ20 సిరీస్

  • ఆగస్టు 03 తొలి టీ20 (ట్రినిడాడ్)
  • ఆగస్టు 06 రెండో టీ20 (గయానా)
  • ఆగస్టు 08 మూడో టీ20 (గయానా)
  • ఆగస్టు 12 నాలుగో టీ20 (ఫ్లోరిడా)
  • ఆగస్టు 13 ఐదో టీ20 (ఫ్లోరిడా)
Last Updated : Jul 9, 2023, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.