ETV Bharat / sports

'కెప్టెన్​గా కోహ్లీ రాజీనామాకు అసలు కారణం అదే'

author img

By

Published : Mar 14, 2022, 10:44 PM IST

Updated : Mar 14, 2022, 11:09 PM IST

Virat kohli- duplesis
విరాట్​ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్​

Virat Kohli Captaincy: జట్టు కోసం విరాట్​ కోహ్లీ శాయశక్తులా కృషిచేశాడన్నాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు డైరెక్టర్​ మైక్​ హెస్సన్​. కొత్త కెప్టెన్​ విషయంపై కోహ్లీని సంప్రదించామన్నాడు.

Virat Kohli Captaincy: విరాట్​ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు డైరెక్టర్​ మైక్​ హెస్సన్​. కోహ్లీ జట్టు కోసం శాయశక్తులా కృషిచేశాడని పొగిడాడు. ఆర్​సీబీ కొత్త కెప్టెన్​ విషయంలో కోహ్లీని, డివిల్లియర్స్​ను సంప్రదించామన్నాడు. ఆర్​సీబీ అన్​బాక్స్​ కార్యక్రమంలో మాట్లాడిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

"ఆర్​సీబీ ఫ్రాంచైజీ కోసం విరాట్​ కోహ్లీ శాయశక్తులా కృషిచేశాడు. జట్టు విజయం కోసం ప్రాణంపెట్టేశాడు. బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడంటేనే అతడికి విశ్రాంతి కావాలనే విషయం అర్థమవుతోంది. అతడు ఆర్​సీబీ సీనియర్​ ఆటగాడిగా కొనసాగాలనుకున్నాడు. దానిని మేము ఎంతో గౌరవిస్తున్నాము."

-మైక్​ హెస్సన్​, డైరెక్టర్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డుప్లెసిస్​ను కొత్త కెప్టెన్​గా నియమించింది ఆర్​సీబీ. ఈ సారి మెగా వేలంలో అతడిని రూ.7 కోట్లు వెచ్చించి కొనుక్కుంది. గతేడాది చెన్నైకి ఆడిన డుప్లెసిస్​ 16 మ్యాచులాడి 633 పరుగులు సాధించాడు. బెంగళూరు తన తొలి మ్యాచ్​ పంజాబ్​ కింగ్స్​తో మార్చి 27న ఆడనుంది.

ఇదీ చదవండి: కోహ్లీ చేసిన పనికి నవ్వులే నవ్వులు.. ఏకంగా మ్యాచ్​ మధ్యలో..

Last Updated :Mar 14, 2022, 11:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.