ETV Bharat / sports

Kohli vs Ashwin: కోహ్లీ కెప్టెన్​గా తప్పుకోవడానికి అశ్విన్ కారణమా?

author img

By

Published : Sep 27, 2021, 10:33 AM IST

Updated : Sep 27, 2021, 11:41 AM IST

అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్​గా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli Captaincy News) ప్రకటించిన నాటి నుంచి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. పని ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పినా.. తెరవెనుక ఏదో నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస వైఫల్యాల కారణంగా కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు అభిప్రాయపడుతుండగా, జట్టులో కోహ్లీపై తిరుగుబాటు మొదలైందని తెలుస్తోంది. దానికి (Kohli vs Ashwin) నాయకత్వం వహించేది అశ్వినేనా?

virat kohli ashwin fight
విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం అనే అంశం గురించే గత కొద్దిరోజులుగా క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. పని ఒత్తిడి కారణంగా టీమ్ఇండియా టీ20 సారథిగా తప్పుకోనున్నానని ప్రకటించి రూమర్లకు చెక్​ పెట్టాడు విరాట్. కానీ, అతడి రాజీనామాకు (Virat Kohli Captaincy News) మించిన వ్యవహారం ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి!

బీసీసీఐ వర్సెస్ కోహ్లీ?

ఇంగ్లాండ్​ పర్యటన (England Tour of India) మొదలైన నాటి నుంచి వైట్​బాల్​ కెప్టెన్​గా కోహ్లీని తొలగిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కోహ్లీ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అసంతృప్తిగా ఉందని వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ (BCCI on Virat Kohli Captaincy) కోశాధికారి అరుణ్ ధుమాల్ కొట్టిపారేశారు. ఆ మరుసటి రోజే టీ20ల్లో కెప్టెన్​గా తప్పుకొంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. వచ్చే నెల టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) ముగిసిన తర్వాత పగ్గాలు వదిలేస్తానని అన్నాడు.

ఈ నిర్ణయం పట్ల అభిమానులు సహా క్రికెట్ మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే టీ20ల్లో మాత్రమే ఎందుకనే ప్రశ్నలూ వచ్చాయి. బీసీసీఐకి, కోహ్లీకి (BCCI VS Kohli) మధ్య చెడిందని కథనాలొచ్చాయి.

ఇదీ చూడండి: 'కోహ్లీ ఒకటి చెబితే బీసీసీఐ మరొకటి చెబుతోంది'

ఈ నిర్ణయం ఇప్పుడే ఎందుకు?

కెప్టెన్సీ విషయమై 6 నెలలుగా చర్చలు జరుగుతున్నాయని, ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ (WTC Final)​ ఓటమి తర్వాత అవి తీవ్రతరం అయినట్లు తెలుస్తోంది. విరాట్ ప్రకటన తర్వాత బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా కొద్ది నెలలుగా ఈ విషయంపై చర్చిస్తున్నట్లు తెలిపారు.

అయితే మెగా టోర్నీకి (T20 World Cup 2021) ఒక నెల ముందే ఈ నిర్ణయాన్ని కోహ్లీ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని.. క్రికెట్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

బీసీసీఐ తనను కెప్టెన్​గా తొలగించనుందని కోహ్లీకి తెలిసిపోయిందా? పని ఒత్తిడి అసలు కారణమేనా? ఎంతో పవర్​ఫుల్​ క్రికెటర్​గా ఉన్న విరాట్​.. ఒక్కసారిగా​ తన ఆధిపత్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు?

ఇదీ చూడండి: Kohli Captaincy: కోహ్లీ నిర్ణయం వెనుక కారణాలేంటో?

కోహ్లీపై తిరుగుబావుటా?

మూడు ఫార్మాట్లలోనూ చాలాకాలంగా ఒక్క సెంచరీ (Virat Last Century) చేయకపోవడం విరాట్​కు ప్రతికూలంగా మారింది. ఫామ్​లేమి, నిర్ణయాలు తీసుకోవడంలో కోహ్లీ సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది. అది ఇతర ప్లేయర్లతో సంబంధాలను దెబ్బతీసింది.

కోహ్లీ స్వభావం పట్ల పలువురు సీనియర్​ ప్లేయర్లు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. వాస్తవానికి కొన్ని నెలల ముందే కోహ్లీపై జట్టులో తిరుగుబాటు మొదలైందని తెలుస్తోంది. విరాట్ తనను అభద్రతాభావానికి గురిచేశాడని ఓ సీనియర్​ ప్లేయర్​.. బీసీసీఐ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అయితే న్యూజిలాండ్​తో డబ్ల్యూటీసీ ఫైనల్లో (India vs New zealand WTC Final) సదరు ఆటగాడే ఏమాత్రం ఆసక్తి చూపలేదని కోహ్లీ ఆరోపించాడు.

ఇదీ చూడండి: తెరపైకి కోహ్లీ-రోహిత్ విభేదాలు.. అసలేం జరిగింది?

అశ్విన్​తో పొసగట్లేదా?

తిరుగుబావుటా ఎగరవేసినవారిలో అశ్విన్ (Kohli vs Ashwin) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్​ పర్యటనలో తుది జట్టులో నిపుణులు సూచించినా అశ్విన్​ను పట్టుబట్టి పక్కనపెట్టాడు కోహ్లీ. అప్పుడే వారి మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలు వచ్చాయి. నాలుగో టెస్టుకు ముందు అశ్విన్​ను తీసుకోవాలన్న ప్రధాన కోచ్​ రవిశాస్త్రి సూచనలను కూడా కోహ్లీ పట్టించుకోలేదు.

సెలక్టర్లు x కోహ్లీ

virat kohli
ధోనీ, కోహ్లీ

ఇక టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియాకు మెంటార్​గా ఎంఎస్​ ధోనీని (MS Dhoni as Mentor) నియమించడానికి ముందు కోహ్లీని సంప్రదించలేదని సమాచారం. టీ20 జట్టులోకి అశ్విన్​ తీసుకురావడం వల్ల సెలక్టర్లకు, కోహ్లీకి (Kohli Vs Selectors) మధ్య వివాదం రాజుకుందని తెలుస్తోంది. అశ్విన్​కు బదులు చాహల్​ను​ తీసుకోవాలని కోహ్లీ భావించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: Kohli News: మెంటార్​గా 'ధోనీ'.. ఈసారైనా 'కోహ్లీ' లక్కు​ మారేనా?

ఇదీ చూడండి: కోహ్లీ ఆలోచన ఎప్పుడూ ఒకటే: చాహల్

వన్డేల్లోనూ వదులుకోక తప్పదా?

కోహ్లీ టీ20లతో పాటు వన్డేల్లోనూ కెప్టెన్​గా తప్పుకోవాలని రవిశాస్త్రి సూచించినట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. కానీ విరాట్ టీ20 సారథ్యాన్ని మాత్రమే వదులుకున్నాడు.

virat kohli
కోహ్లీతో రోహిత్ శర్మ

రాబోయే రోజుల్లో వన్డేల్లో కెప్టెన్​గా విరాట్​ను తప్పించి రోహిత్​కు (Kohli Vs Rohit) పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్​లో జట్టు ప్రదర్శన కీలకం కానుంది. ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు కెప్టెన్సీని కూడా వదులుకుంటున్నట్లు (Virat Kohli Resigns RCB) విరాట్ ఈ మధ్యే ప్రకటించాడు.

ఇవీ చూడండి:

Virat Kohli Captaincy: కోహ్లీ.. వన్డేల్లోనూ కెప్టెన్​గా తప్పుకోవాలన్న శాస్త్రి!

kohli rcb: ఫ్యాన్స్​కు కోహ్లీ మరో షాక్- ఆర్​సీబీ కెప్టెన్సీకి గుడ్​బై

Virat Kohli News: 'కోహ్లీ ఇంకొంత కాలం వేచి చూడాల్సింది'

Last Updated : Sep 27, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.