Kohli Captaincy: కోహ్లీ నిర్ణయం వెనుక కారణాలేంటో?

author img

By

Published : Sep 17, 2021, 6:56 AM IST

Updated : Sep 17, 2021, 7:31 AM IST

Kohli gives up T20I captaincy: The 3 big takeaways from India skipper's startling announcement

టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ(Virat Kohli News) వన్డే, టీ20 పగ్గాలు వదిలేస్తున్నాడట.. ఇటీవల ఒక రోజంతా జోరుగా ప్రచారం సాగిన వార్త ఇది. కానీ ఆ వదంతుల్ని బీసీసీఐ కొట్టి పారేసింది. కానీ రెండు రోజుల తిరిగేసరికి.. తాను టీ20 పగ్గాలు(Kohli Captaincy) వదిలేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు కోహ్లీ. మరి విరాట్‌ ఈ నిర్ణయానికి ఎందుకొచ్చాడు..? ఇప్పుడే ఎందుకీ నిర్ణయాన్ని ప్రకటించాడు..?

మేటి బ్యాట్స్‌మెన్‌గా పేరున్న చాలామంది కెప్టెన్సీ భారాన్ని మోయలేక విడిచిపెట్టిన వాళ్లే. కానీ కోహ్లీ మాత్రంకెప్టెన్సీ(Kohli Captaincy) తనకే మాత్రం భారం కాదని చాటుతూ బ్యాట్‌తో గొప్పగా రాణించాడు. కానీ గత రెండేళ్లుగా అతని ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదన్నది నిజం. మూడు ఫార్మాట్లలోనూ నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత 53 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్‌ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి. విరాట్‌ ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీగా అందుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీని(Kohli RCB) ఒక్కసారి కూడా విజేతగా నిలపకపోవడాన్ని అతని నాయకత్వ లోపంగా చూస్తున్నారు. మరోవైపు రోహిత్‌ నాయకత్వంలో(Rohit Sharma Captaincy News) ముంబయి అయిదుసార్లు టైటిల్‌ గెలిచింది. దీంతో టీ20లకు రోహిత్‌ను సారథిగా నియమించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ నిర్ణయం(Kohli Stepping Down) తీసుకున్నాడనిపిస్తోంది.

ఇప్పుడే ఎందుకు?

భారత క్రికెట్లో గతంలో ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి ఆటగాళ్లు రాజీనామా చేసే సంస్కృతి ఉండేది. కానీ 2007 తర్వాత అలాంటి పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. నాయకత్వ బదలాయింపు సాఫీగా సాగిపోతోంది. ధోనీ చేతుల్లో నుంచి కోహ్లీ అలాగే పగ్గాలు స్వీకరించాడు. కోహ్లీ టీ20 కెప్టెన్‌గా దిగిపోతానని ప్రకటించడం వెనక కూడా ఇదే సానుకూల వైఖరి కనిపిస్తోంది.

ఒకవేళ కోహ్లీ ఇప్పుడీ ప్రకటన చేయకుండా, ప్రపంచకప్‌కు వెళ్లి అక్కడ జట్టు టైటిల్‌ గెలవకపోతే.. కెప్టెన్‌గా అతణ్ని తప్పించాలనే డిమాండ్‌ బలపడుతుంది. ఆ స్థితిలో కెప్టెన్సీకి గుడ్‌బై చెబితే అదొక అవమానంలా కనిపించొచ్చు. అది వివాదంగా మారొచ్చు. ఒకవేళ టీమ్‌ఇండియా ప్రపంచకప్‌(ICC T20 Worldcup 2021) గెలిస్తే.. కోహ్లీ సగర్వంగా టీ20 నాయకత్వ బాధ్యతల తప్పుకొన్నట్లవుతుంది. అందుకే కోహ్లీ ఇప్పుడే ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది.

వారసుడెవరు?

కోహ్లీ ప్రకటనతో ఇప్పుడిక టీ20ల్లో అతని వారసుడు(Team India New Captain) ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌లో ముంబయిని అయిదుసార్లు విజేతగా నిలపడమే పేరు తెచ్చుకోవడమే కాక.. కోహ్లీ అందుబాటులో లేనపుడు భారత జట్టును చక్కగా నడిపించిన రోహిత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ కోహ్లీ కంటే రెండేళ్లు పెద్దవాడు, ఇంకో మూణ్నాలుగేళ్లలో రిటైరయ్యే అవకాశమున్న 34 ఏళ్ల రోహిత్‌కు కుర్రాళ్ల ఆటైన టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ అప్పగించడం సరైందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్‌, శ్రేయస్‌, పంత్‌ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి బీసీసీఐ(BCCI on Virat Kohli Captaincy) ఏం చేస్తుందో చూడాలి.

ఇదీ చూడండి.. కోహ్లీ కీలక నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్​బై

Last Updated :Sep 17, 2021, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.